చంద్రబాబు: మహానాడు విషయంలో చేతులెత్తేసినట్టేనా..?

Divya
టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరఫున ఎప్పుడూ కూడా ప్రతి ఏడాది మహానాడు నిర్వహిస్తూ ఉండేవారు. అయితే గత కొన్నేళ్లుగా దీనిని వాయిదా వేస్తూ ఉన్నారు.. ఎన్నికల కారణంగా ఈసారి మహానాడు ను వాయిదా వేయవలసి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్లో తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4వ తేదీ వరకు వేచి చూస్తున్నారు. టిడిపి పార్టీ 120 నుంచి 160 సీట్లు వస్తాయని విర్రవీగుతూ పలు రకాల ప్రకటనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మహానాడు వేడుకలు చేయడానికి మాత్రం చేయడానికి చంద్రబాబు కాస్త భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పూర్తి చేసుకున్న తర్వాత ఆ పార్టీ నిర్వహించే వేడుకనే మహానాడుగా చేసుకుంటూ ఉంటారు. ఎన్నో సందర్భాలలో మహానాడు ను చంద్రబాబు నాయుడు స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు. కరోనా కారణంగా ఇటీవలే రెండు సంవత్సరాలు నిర్వహించలేదు. గత ఏడాది మహానాడు సందర్భంగా సూపర్ సిక్స్ హామీలను అయితే ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికలలో తెలుగుదేశం వారంతా తాము భారి సీట్లు గెలుస్తామని విర్రవీగుతున్నప్పటికీ ఆ సీట్ల పైన నమ్మకం లేకపోవడంతో మహానాడు సభను వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ కూటమిలో భాగంగా గెలిచినప్పటికీ మహానాడు ఉండే ప్రసక్తి లేదని కూడా తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు.. గెలిచినా కూడా కచ్చితంగా మహానాడుని సైతం చేయరని పలువురు పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఏదో ఒకటి చేస్తారనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎన్నికల రిజల్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయమైతే టిడిపిలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: