* ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని స్పష్టం చేసిన బీజేపీ
* దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు చేస్తున్న చంద్రబాబు
* బీజేపీతో పొత్తే చంద్రబాబును ఇరకాటంలో పడేసిందా
పల్నాడు - ఇండియా హెరాల్డ్ :
ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. ప్రస్తుతం రకరకా
ల సర్వేలు వైసిపి గెలుపు పై అలాగే మరికొన్ని సర్వేలు టిడిపి గెలుపు పై తమ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయి.ఏపీలో మూడు పార్టీల కూటమి ఎన్నికల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రచారంలో భాగంగా సీఎం జగన్ సవాల్ చేశారు.అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ముస్లిం ఓట్లు నిర్ణయాత్మక అంశంగా మారనున్నారు.దేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని ఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చామన్నారు. రాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందని అన్నారు.నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు.వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రచార వేళ ప్రశ్నించారు.తాము ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పారు.నిన్న మొన్నటిదాకా ముస్లిం ప్రజలు ఎంతోకంత టీడీపీ కి అనుకూలంగా ఉన్నారు. కానీ టీడీపీ బీజేపీకి పొత్తుగా మారిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ప్రజల్లో మార్పు అనేది కనబడుతుంది.మైనారిటీ సోదరులకు ఇచ్చే 4 శాతం రిజర్వేషన్లు మతం ఆధారంగా ఇవ్వబడలేదు.
పల్నాడు జిల్లాలోని మైనారిటీలు బీజేపీతో పొత్తుకు ముందు ఎంతోకొంత టీడీపీకి అనుకూలంగా ఉండేవారు కానీ పొత్తు తర్వాత టీడీపీకి దూరం అయ్యారు. పల్నాడులోని ఏడు నియోజకవర్గాల్లో ఈసారి ముస్లింలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. దీనితో పల్నాటి టీడీపీ ఏం చేయాలో తేలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఈ 4 శాతం రిజర్వేషన్ వెనుకబడిన తరగతుల ప్రాతిపదికన ఉంది. దీనిపై నేను బీజేపీని, ఇతర ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను. అన్ని మతాలలో బీసీలు, ఓసీలు ఉన్నారు, ఇవి రాజ్యాంగ నిబంధనలకు లోబడి వెనుకబడిన తరగతుల ప్రాతిపదికన ఇవ్వబడిన రిజర్వేషన్లు అలాంటి రిజర్వేషన్లపై రాజకీయాలు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దని సీఎం జగన్ అన్న సంగతి తెల్సిందే.దానికి అనుబంధంగానే గంపగుత్తగా ముస్లిం ఓటర్లందరూ వైసిపి ప్రభుత్వానికి తమ మద్దతు తెలిపినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.చంద్రబాబు బీజేపీతో కలవడమే ముస్లిం ఓటర్లలో తీవ్ర అసంతృప్తికి కారణం అని దాని ప్రభావం అనేది కచ్చితంగా జూన్ 4 తేదీన కనబడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.