ఏపీలో ఎవరు ఎటువైపు : ఆ కులం ఓట్లన్నీ జగన్ కే పడ్డాయట..??

Suma Kallamadi

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆడవాళ్లు, మహిళలు, వృద్ధులు పల్లెటూరు ప్రజలు ఎక్కువగా ఓట్లు వేశారు. వారి కారణంగా జగన్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం వైసీపీ నాయకులలో బలపడింది. వీరితో పాటు కులాల వారిగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గ ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీకే ఓట్లు వేశారని తెలుస్తోంది. ఒకే కులానికి చెందిన వారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంటుంది. దానికి తోడు తమ సామాజిక వర్గానికి చెందిన జగన్ అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నారు. ఆయనకి కాకుంటే ఇంకా ఎవరికి ఓటు వేయాలి అనే ఉద్దేశంలో ఉండి ఉండొచ్చు.
సాధారణంగా ఒకే కులం వాడయితే వారికి ఓటు వేయాలి అనే సెంటిమెంట్‌, ప్రేమ ఇండియన్స్ లో ఎక్కువగా ఉంటుంది. వేరే దేశాల్లో కూడా ఇలాంటి ప్రేమలు ఉండటం సహజం. సో ఆ విధంగా చూసుకుంటే రెడ్డి కులపు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ లండన్ టూర్ లో ఉన్నారు. ఆయన వచ్చే నెల 1వ తేదీన మళ్లీ తిరిగి రానున్నారు. జులై 4న ఓట్లు విప్పనన్నారు. ఆరోజే ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరనేది తేలుతుంది. చంద్రబాబు నాయుడు కి రెడ్డి కులం వాళ్ళు ఓట్లు వేయడం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. నాయుడుకి ఓన్లీ కమ్మ వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేస్తారు. జనసేన కూడా టిడిపిలో కలిశారు కాబట్టి కాపు కులపు ఓట్లు కూడా రావచ్చు. బీజేపీ పూర్తి కారణంగా ఉన్నత కులాల వాళ్ళు చంద్రబాబుకి ఓటు వేసి ఉండవచ్చు. అందరూ ఓటు వేస్తారని కాదు కొంతమంది మాత్రం అటువైపు తమ ఆసక్తిని మొగ్గు చూపి ఉండవచ్చు  
 చంద్రబాబు నాయుడు ఏం చేశారనేది చూడకుండా ఓట్లు వేసే కమ్మ ప్రజలు ఎంతమంది ఉన్నారని అంటారు. అందరి కులాలు వారు ఇంతే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే జగన్ బీసీ ప్రజల సంక్షేమం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని వారి ఓటు బ్యాంకు కూడా గెలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరందరి ఓట్లతో జగన్ భారీ మెజారిటీని ఈసారి నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: