Roja : నా సొంత వారే నేను ఓడిపోవాలని ప్రచారం చేస్తున్నారు.. రోజా షాకింగ్ వ్యాఖ్యలు..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం  ఎంతో జోరుగా ప్రారంభం అయింది. నేడు ఉదయాన్నే వైసీపీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..అలాగే నేటి ఉదయం నుంచి సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పలు నియోజకవర్గాలలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది.. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరుగుతూనే వున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ సారి కూడా గొడవలు బాగా జరుగుతున్నాయి.. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రోజాకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత నెలకొంటుంది. రోజాకు ఓటు వేయొద్దు అంటూ పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు కూడా చేసారు.


దీనితో నగరిలో రోజాకు చేదు అనుభవం ఎదురైంది . రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె మూడోసారి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆమె లక్ష్యం నేరవేరనివ్వకుండా ఆమెను ఎలాగైనా ఓడించేలా సొంత పార్టీ నేతలే ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజాకు ప్రజల నుంచేకాక సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ ఎదురవుతుంది. ఈ సారి ఎన్నికలలో రోజా కచ్చితంగా ఓడుతుందని ప్రచారం చేస్తున్నారు.నగరి నియోజకవర్గంలో మెజారిటి వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. నగరిలో తనను ఓడించేందుకు కొందరు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తుంది.ఆమె చెప్పారు. జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న కేజే కుమార్ మరియు ఆయన వర్గీయులు తన ఓటమి కోసం టీడీపీ నేతల కంటే ఎక్కువగా పని చేస్తున్నారని చెప్పి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: