వై.యస్.జగన్: 2024.. జగనన్న వన్స్ మోర్..!

Divya
2019 ఎన్నికల ఫలితాలు 2024 లో కూడా రిపీట్ కాబోతున్నాయని.. సీఎం జగన్ ఐదేళ్లలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆయనకు తిరుగులేని నాయకుడిగా పేరుపొందారు.. అందుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. వైసిపి శ్రేణులు కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగానే చెబుతున్నారు. అందుకే ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నో రకాల సర్వే సంస్థలు కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగానే వస్తున్నాయి. దాదాపుగా పదికి పైగా సర్వే సంస్థలు అంచనాలలో మళ్లీ ఫ్యాన్ పార్టీనే ప్రభంజనం సృష్టిస్తుందని తెలియజేస్తున్నాయి.

2019లో రాయలసీమలో సాధించినటువంటి సీట్లు రిపీట్ అవుతాయని కోస్తాలో వైసీపీ కూడా మరొకసారి తన పట్టు నిలుపుకుందంటూ పలువురు విశ్లేషకుల సైతం తెలియజేస్తున్నారు.. వైసిపి పార్టీ ఈసారి 120 నుంచి 130 స్థానాలు అసెంబ్లీ సీట్లు 20 కు పైగా ఎంపీ సీట్లను సాధిస్తుందని ఎన్నో సర్వేలు కూడా ఇప్పటికే అంచనా వేశాయి.. ముఖ్యంగా టైమ్స్ నౌ, ఆత్మసాక్షి, జన్మత్ పోల్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రెడిట్ ఇతరత్రా సంస్థలు కూడా జగన్ దే విజయం అంటూ తెలియజేశాయి.

ముఖ్యంగా జగన్ సిద్ధం సభ, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో మరింత ప్రేక్షకాదరణ పెరిగిందని కూడా చెప్పవచ్చు. నియోజకవర్గం క్యాడర్ బలంగా ఉండడంతో పాటు సీఎం జగన్ అమలు చేసినటువంటి కొన్ని పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందడంతో మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.. మరొకవైపు టిడిపి , జనసేన,  బిజెపి కూటమితో సఖ్యత కుదరకపోవడం అభ్యర్థుల ఎంపిక విషయంలో తడబాటు చేసుకోవడం మేనిఫెస్టో విషయంలో అమలు సాధ్యం కానటువంటి వాటిని పెట్టడం ఇవన్నీ కూడా వైసిపి పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే గతంలో వాలంటరీలను దూరం పెడతామని చెప్పి చివరికి వాలంటీర్ లకు రూ.10,000 జీతాలు చేస్తామని చెప్పడంతో వైసీపీ శ్రేణులతో పాటు పలువురు నేతలు కూడా టిడిపి పార్టీని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు గతంలో చెప్పిన హామీలను కూడా అమలు చేయకపోవడంతో ఇప్పుడు మేనిఫెస్టోని నమ్మడం లేదు. అలా ఈ అంశాలన్నీ కూడా జగన్ కి కలిసి వస్తున్నాయని అందుకే మళ్ళీ జగన్ రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: