ఏపీ: రెండు పార్టీల నేతలకు ఏకైక గాడ్ ఫాదర్ ఆ టాలీవుడ్ హీరో..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా టిడిపి సభలలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, ఫ్లెక్సీలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. వీరి పైన చంద్రబాబు అసహనాన్ని ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉండేవారు. ఇది రొటీన్ గా జరిగేది.. అయినప్పటికీ ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాలో అటువంటి సంఘటనలు చాలానే తెరపైకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. లోకేష్ నిలబడిన నియోజవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా ఎంతోమంది నందమూరి కుటుంబ సభ్యులను ఈ విషయం అడిగారు..ప్రస్తుతానికైతే రాజకీయాల పైన ఆసక్తి లేదని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో బిజీగా ఉన్నారని తెలుపుతూ వస్తున్నారు.

మరో 10 ఏళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు అడుగులు వేయరని పలువురు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడమే కాకుండా ఒక టీడీపీ నేత రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ తో ప్రదర్శించారు. ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. ఒకపక్క టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ.. ఆ పార్టీ అధినేత స్వాగతించడం లేదని వార్తలు వినిపిస్తున్న తరుణంలో టిడిపి నేత టీజీ భరత్ కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ప్రదర్శించారు. మిగిలిన నేతలు ఎవరూ కూడా ఇలాంటి సాహసం ఒడిగట్టలేకపోయారు.

మరొకపక్క వైసీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోని ఆయన నామినేషన్ సందర్భంగా తెగ హల్చల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో వైయస్ జగన్ ఫోటోలను కూడా ఏర్పాటు చేసి నానా హంగామా చేస్తున్నారు. అలా గురువారం మొత్తం గుడివాడలో ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శన తో మారుమోగాయి. మరొకసారి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ఇద్దరి నేతలకు జూనియర్ ఎన్టీఆర్ గాడ్ ఫాదర్ అన్నట్టుగా పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: