ఏపీ: రానున్న ఎన్నికల్లో వైసీపీదే పై చేయి?

Suma Kallamadi
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాలన్నీ ఎవరి దారిలో వారు ఫుల్ జోష్ తో ప్రచార కార్యక్రమాలు షురూ చేసారు. ఈ క్రమంలోనే కర్నూలు నియోజక వర్గంలో అయితే మరలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించనుందని ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి అయినటువంటి ఇంతియాజ్ ఇక్కడ గొప్ప మెజారిటీతో గెలువబోతున్నారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. కాగా ఇంతియాజ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ తరుణంలో హాఫీజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి.
ఇక ఇంతియాజ్ నామినేషన్ కార్యక్రమం విషయానికొస్తే అతిరథమహారధుల మధ్య కన్నుల పండుగగా నిర్వహించడం కొసమెరుపు. అక్కడ ఖచ్చితంగా ఇంతియాజ్ గెలుస్తారనే ధీమాతోనే అంత ఖర్చు పెట్టి మరీ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. కాగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, ఎంపీ అభ్యర్థి బి.వై రామయ్య, జిల్లా అధ్యక్షురాలు సీత్ర సత్యనారాయణమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నాయకులు అహ్మద్ అలీ ఖాన్ మొదలగువారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తూ అఫిడవిట్లు సమర్పించాల్సి ఉండగా ఆయా అఫిడవిట్లలో తమ స్థిర, చర ఆస్తుల వివరాలన్నీ పొందు పరచడం జరిగింది. ఇళ్ళెక్కడున్నాయి? ఎక్కడెక్కడ స్థలాలున్నాయి? కార్లు ఎన్ని ఉన్నాయి? ఎంత బంగారం ఉందన్న వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ల ఆధారంగా.. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల వద్ద ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే దిమ్మ తిరిగే విషయాలు వెలుగు చూశాయి. కొందరు అభ్యర్థుల వద్ద కేజీల కొద్దీ బంగారం ఉండగా మరికొందరు గ్రాములకే పరిమితం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: