కేసీఆర్ అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ.. కేటీఆర్ ఒక మాస్టర్ పీస్?

praveen
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయ ఉద్దండడు అని పిలుచుకుంటూ ఉంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయనకు సబ్జెక్టుపై ఉన్న అవగాహన అలాంటిది.. ఆయన వాగ్దాటి కి అటు ప్రత్యర్థులు ఎప్పుడు భయపడిపోతూ ఉంటారు. ఒక్కసారి కెసిఆర్ ప్రసంగం మొదలుపెట్టారు అంటే ఇక ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మాటల తూటాలు ఎక్కడ తమ వైపుకు మళ్ళీ గుచ్చుకుంటాయో అని భయపడిపోతూ ఉంటారు. అలాంటి కెసిఆర్ కు కొడుకుగా అటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ వారసుడిగా గుర్తింపును సంపాదించుకోవాలంటే అది మామూలు విషయం కాదు.

అది కూడా రాజకీయాలతో ఎక్కడ సంబంధం లేకుండా.. విదేశాల్లో ఉద్యోగం చేసిన వ్యక్తి ఇక ఇలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలంటే అది చిన్న విషయం కాదు. కానీ కేటీఆర్ ఇది చేసి చూపించాడు.   కెసిఆర్ అనే బ్యాక్ గ్రౌండ్ తో  పరిచయమైనా ఇక రాజకీయాల్లోనే ఆయన ఒక.. స్పెషల్ పీస్ అనే విధంగా గుర్తింపును సంపాదించుకున్నారు. గుంటూరులోని విజ్ఞాన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కేటీఆర్ హైదరాబాద్లో నిజాం కాలేజీలో మైక్రో బయాలజీ లో డిగ్రీ పొందారు.

 మొదటినుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న తండ్రి ఆదేశాల మేరకు కేవలం చదువు, ఉద్యోగం పైన దృష్టి పెట్టారు.  1996 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూణేలో పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో 1998 - 2000 సంవత్సరంలో ఎంబీఏ పూర్తి చేశారు. అయితే ఇలా చదువు మీద దృష్టి పెట్టారు తప్ప రాజకీయాల్లోఎక్కడ కనిపించలేదు. అనంతరం అమెరికాలోని కంపెనీలో పనిచేసి అదే కంపెనీలో తక్కువ సమయం లోనే ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఇలా విదేశాల్లో ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి.. మాస్ నాయకుడిగా ఎదుగుతారని ఎవరు ఊహిస్తారు.

 తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యేందుకు ఏకంగా 2004తో ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంటికి వచ్చేసాడు కేటీఆర్. అయితే మొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తండ్రి తరఫున ప్రచారం చేసి తన వాగ్దాటితో అందరి దృష్టిని ఆకర్షించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన వ్యక్తి ఏంటి రాజకీయాల్లో మాస్ నాయకుడు రేంజ్ లో ప్రసంగాలు ఇవ్వడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు. తొలిసారి 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష రాజకీయాల పోటీ చేసిన కేటీఆర్ విజయం సాధించారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010 ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఇలా వరుసగా అక్కడి నుంచి విజయం సాధిస్తూ వచ్చారు.

అయితే ఇక ఎలాంటి విషయం పైన అయినా సరే అనర్కలంగా మాట్లాడటం కేటీఆర్ స్టైల్. దేశంలోనే బెస్ట్ ఐటి మినిస్టర్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. ప్రత్యర్థులకు పదునైన విమర్శలతో కౌంటర్లు ఇవ్వడంలో ఏకంగా కేసీఆర్ను మించిన వాడే అనిపిస్తూ ఉంటాడు కేటీఆర్ . ఇక కెసిఆర్ తర్వాత గులాబీ పార్టీ బాస్ కేటీఆర్ అని అందరికీ అర్థమయ్యేలా చేశాడు. గులాబీ పార్టీ గెలిస్తే నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని పార్టీ నేతలు అందరూ ఫిక్స్ అయిపోయారు కూడా . ఇలా కెసిఆర్ అనే భారీ బ్యాగ్రౌండ్ ఉన్న కానీ కేటీఆర్ తనొక స్పెషల్ పీస్ అని అందరికీ అర్థమయ్యేలా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: