17 రోజుల బస్సు యాత్ర... కెసిఆర్ టార్గెట్ అదే..?

Pulgam Srinivas
పోయిన సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనుహంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దానితో మరికొన్ని రోజుల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తాను నిరూపించుకోవడం కోసం కేసీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక ప్రాంతాలను పర్యటించి కాంగ్రెస్ పార్టీపై తనదైన రీతిలో విమర్శలను గుప్పించాడు. ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరింత సీరియస్ గా ప్రచారాలను చేయడానికి కేసీఆర్ సిద్ధం అయ్యాడు.

అందులో భాగంగా బస్సు యాత్ర ను తలపెట్టాడు. ఏకంగా విరామం లేకుండా కెసిఆర్ 17 రోజుల పాటు ఈ బస్సు యాత్రలో పాల్గొననున్నాడు. అందులో భాగంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యటించి రోడ్ షో లను నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రలో భాగంగా కేవలం రోడ్ షో లను మాత్రమే నిర్వహించడం కాకుండా ఈ పర్యటనలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, కాంగ్రెస్ పార్టీ వల్ల జనాలకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి.

అనే దానిని క్లుప్తంగా తెలుసుకొని వాటికి ఏ విధమైన పరిష్కారాలను జనాలకు ఇవ్వాలి అనే దానిపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ 17 రోజుల భారీ బస్సు యాత్ర నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాదు నుంచి 100 వాహనాల భారీ కాన్వాయ్ తో కేసీఆర్ మిర్యాలగూడకు చేరుకుంటారు. ఇక సాయంత్రం 5  గంటల 30 నిమిషాలకు మిర్యాలగూడలో ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

 ఇందుకోసం ఇప్పటికే అక్కడి నాయకులు కార్యకర్తలు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక 17 రోజుల ఈ బస్సు యాత్ర మే 10 వ తేదీన సిద్దిపేటలో ముగియబోతుంది. కేసీఆర్ చేయబోయే ఈ భారీ బస్సు యాత్రకు ప్రజల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది అని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: