రాయలసీమ (హిందూపురం): బాబూ Vs స్వామి.. మధ్యలో గాలిరెడ్డి..!

Divya
హిందూపురం పార్లమెంటు స్థానం లో ఎలాగైనా పోటీ చేయాలని కాకినాడ సరస్వతి పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి చాలా పట్టుదలతో ఉన్నారు. ఎక్కడ కూడా అసలు వెనకడుగు వేయడం లేదు.. దీంతో కచ్చితంగా ఈ విషయంపై వైసీపీకి లాభం వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ఆశలను సైతం నీళ్లు చల్లేలా పరిపూర్ణానంద స్వామి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఈయన హిందూపురం ఎంపీ టికెట్ ని ఆశించారు. కానీ అక్కడ మాత్రం టికెట్టు ఇవ్వలేదు. ఇక్కడ టిడిపి నిలబడుతోంది.

టిడిపి నుంచి అంబిక లక్ష్మీనారాయణ పోటిగా ఉన్నారు ఈయన బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. అక్కడ ఓట్లు శాతం ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు లెక్కలు వేసుకొని మరి ఇక్కడ ఆయనను నిలబెట్టారు. ఇక వైసిపి కూడా సరికొత్త ప్రయోగంతో కర్ణాటక మూలాలు ఉన్న జోలదరాశి శాంతా కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది.బిజెపికి టికెట్ ఇవ్వకపోవడంతో పరిపూర్ణానంద స్వామి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ అక్కడ నేతలను సైతం హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా హిందూపురంలో మూడేళ్లుగా ఆయన ఉండి ప్రజలకు చేరువగుతూనే ఉన్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడితే కచ్చితంగా ఓట్లు చీలుతాయి ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించి ఆయనను పిలిపించి రెండు రోజులు క్రిందట మాట్లాడినా కూడా ఆయన శాంతించలేదని తెలుస్తోంది. పోటీకి మాత్రం సై అంటూ తెలియజేస్తూనే ఉన్నారు పరిపూర్ణానంద స్వామి. ఇది కచ్చితంగా టిడిపి పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది.. ఇదంతా ఇలా ఉండక బాబు వర్సెస్ స్వామి మధ్య పోరు జరుగుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సహకారంతో ఇక్కడ వైసిపి నేత శాంతాను గెలిపించాలని పక్కా ప్రణాళికలు వేస్తున్నారట. ముఖ్యంగా ఈయనకు ఆమె బంధువు కావడంతో గెలిపించుకునే చర్యలు అయితే చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాబు వర్సెస్ స్వామీ మధ్యలో గాలి జనార్దన్ రెడ్డి అన్నట్టుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: