పవన్: చదివింది కొంత.. చెప్పేది అంతా.. విద్యార్హత ఇదే..!

Divya
గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వేసిన ఎన్నికల నామినేషన్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన ఆస్తులు చదువు గురించి ఎక్కువగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తున్న సమయంలో తన విద్యార్హత పైన జోరుగా చర్చలు సాగాయి.. ఎందుకంటే అఫిడవిట్లో ఆయన పదవ తరగతి మాత్రమే పాస్ అయినట్లుగా తెలియజేశారు.. కానీ అఫిడవిట్ కు కొన్ని రోజుల ముందు తనను తాను ఇంటర్ విద్యార్థి అంటూ తెలియజేసుకున్నారు.

ఇక నాగబాబు అయితే  మరో ముందడుగు వేసి ఇంటర్మీడియట్ తో పాటు మరికొన్ని సబ్జెక్టులతో డిగ్రీ హోల్డర్ గా పేరు పొందారు అంటూ నానా మాటలు తెలియజేశారు. నాగబాబు ఎల్ఎల్బి చదివి మద్రాస్ బార్ కౌన్సిలర్లు రిజిస్ట్రేషన్ చేయించారని కూడా తెలియజేశారు.. చిరంజీవి మాత్రం డిగ్రీ పాసయ్యారని.. తన చెల్లెలలో ఒక చెల్లెలు ఎంబిబిఎస్.. మరో చెల్లెలు డిగ్రీ చదివారని కూడా నాగబాబు వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ పైన డిగ్రీ హోల్డర్ అని చేయడంతో  అడ్డంగా దొరికిపోయారు.

ఈసారి అఫీడబిట్ లో పవన్ కళ్యాణ్ మాత్రం చాలా జాగ్రత్తగా తన విద్యా అర్హత విషయంలో పడ్డట్టుగా కనిపిస్తోంది. కేవలం తాను పదవ తరగతి మాత్రమే పాస్ అయ్యానంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. దీంతో ఈ విషయాన్ని అందరూ వదిలేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా తను ఇష్టం వచ్చినట్లుగా లక్ష పుస్తకాలు చదివానని.. డిగ్రీ ఐటి చేశానంటూ ఇంటర్లో ఎంపీసీ చేశానంటూ ఏవేవో కథనాలు చెప్పారు.అయితే ఈసారి అఫిడవిట్లో  కేవలం తాను పదవ తరగతి అన్నట్లుగా తెలియజేసినట్టు తెలుస్తోంది.. దీంతో పలువురు నేతలు చదివింది కొంత.. చెప్పేది అంతా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగానే ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: