'స‌మ‌రం' లో సామాన్యుడు: కేంద్ర‌మంత్రితో కార్పోరేట‌ర్ అమితుమీ..?

RAMAKRISHNA S.S.

- బ‌ల‌మైన సుజా చౌద‌రిపై కార్పోరేట‌ర్‌ను ప్ర‌యోగించిన జ‌గ‌న్‌
- కూట‌మికి అచ్చిరాని కోట‌లో బీజేపీ, వైసీపీ హోరాహోరీ
- బెజ‌వాడ‌లో సెగ‌లు రేపుతోన్న వెస్ట్ రాజ‌కీయం

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఒక‌వైపు.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నాయ‌కుడు. అంతేకాదు.. కేంద్రంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. పాతిక సంవ‌త్స‌రాలుగా.. రాజకీయాల్లో ఆయ‌న కొట్టిన పిండి. దేనినైనా మేనేజ్ చేయ‌గ‌ల నాయ‌కు డిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మ‌రి ఇలాంటి నాయ‌కుడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగితే.. మ‌రి ఇలాంటి నేత‌పై పోటీ చేసే ప్ర‌త్య‌ర్థి ఏ రేంజ్‌లో ఉండాలి. ఇంత‌క‌న్నా కోట్ల‌కు కోట్ల డ‌బ్బుండా లి.. మ‌రిన్నిసంవ‌త్స‌రాల సీనియార్టీ ఉండాలి.. ఇంకా మ‌రింత మేనేజ్ చేసే ప‌రిస్థితి ఉండాల‌ని అనుకుంటున్నారా?

ఇలా అనుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, విజ‌య‌వాడ వెస్ట్‌నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఎందు కంటే.. ఇక్క‌డ అధికార పార్టీ వైసీపీ ప్ర‌యోగాన్ని చేపట్టింది. సిట్టింగులు, ఆశావ‌హులు.. బ‌ల‌మైన వ్యాపార వేత్త‌ల‌ను కూడా కాద‌ని.. సాధార‌ణ కార్పొరేట‌ర్‌ను బ‌రిలో నిలిపింది. చిన్న కారు.. ఒక చిన్న సొంతిల్లు మాత్ర‌మే ఉన్న మైనారిటీ వ‌ర్గానికి చెందిన షేక్ ఆసిఫ్‌కు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఈ ప్ర‌యోగం చేయ‌డం.. ఎప్పుడో 1960ల‌లో ఇక్క‌డ జ‌రిగిన ప్ర‌యోగాన్ని గుర్తు చేస్తుంది.

అప్ప‌ట్లో మురిపిళ్ల చిట్టి అని ఒక ప్ర‌జాస్వామ్య వాదికి టికెట్ ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. పోటీ చేసిన వారంతా.. పార్టీ ఏదైనా.. బ‌ల‌మైన నాయ‌కులే. ఇక‌, ఇప్పుడు బీజేపీ నుంచి కూట‌మి అభ్య‌ర్థిగా వైసీపీ అభ్య‌ర్థికి ప్ర‌త్య ర్థిగా బ‌రిలో నిలిచిన నాయ‌కుడు.. మిలియ‌నీర్‌గా పేరున్న కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి. ఎన్నిక‌ల అపిడ‌విట్‌లో పేర్కొన్న మేర‌కు ఆయ‌న ఆస్తులు.. 150 కోట్ల రూపాయ‌లు. ఇక‌, కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రం లోనూ రాజ‌కీయ ప‌ర‌ప‌తి మెండు. మాజీ మంత్రి కూడా.

అంతేకాదు..ఏక‌కాలంలో ఏ ప‌నినైనా సాధించ‌గ‌ల నాయ‌కుడిగా కూడా సుజ‌నాకు పేరుంది. ఇలాంటి నాయ‌కుడిపై వైసీపీ ఒక సామాన్య కార్పొరేట‌ర్‌కు అవ‌కాశం క‌ల్పించింది. అయితే.. ఈయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న ఏకైక అవ‌కాశం మైనారిటీ సామాజిక వ‌ర్గంతోపాటు.. స్థానిక నేత‌. అందుబాటులో ఉంటాడ‌నే పేరు మాత్ర‌మే. దీనిని బ‌ట్టి.. ఒక భారీ వ్యాపార వేత్త‌పై పోటీ చేస్తున్న ఆసిఫ్‌కు.. ఏమేర‌కు ప్ర‌జ‌ల ఆశీర్వాదం ద‌క్కుతుందో చూడాలి. ఏదేమైనా.. స‌మ‌రంలో సామాన్యుడు గెలుస్తాడా? అసామాన్యుడిఆధిప‌త్య‌మే నెగ్గుతుందా? అనేది  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: