ఏపీ: టిడిపికి షాక్.. వైసీపీలోకి ఫైర్ బ్రాండ్..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల జంపింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ఆడారి కిషోర్ కుమార్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈరోజు ఉదయం 8:30 నిమిషాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.. ఈ సమయంలోనే ఆడారి కిషోర్ ఒక లేఖను కూడా రాశారు.
ఆలేఖలో తన రాజకీయ జీవితం 30ఏళ్లుగా విద్యార్థి నాయకునిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ వచ్చాను..నా రాజకీయ జీవితం దాదాపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు విజనరీ అని, ఎవరికైనా అవకాశాలు కల్పిస్తుందని ఎన్టీఆర్ ఆశలను నెరవేర్చడానికే చంద్రబాబు వారసులు అన్నట్టుగా విశ్వసించి పార్టీలో చేరి ఎన్నో సేవలు చేశాను.. కానీ తన సేవలను ఎవరూ గుర్తించలేదు.. తాను స్వయంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ,అమ్మగారిని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా కలిశారని అందరూ సానుకూలంగానే స్పందించారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో టికెట్ నీకే అని హామీ ఇచ్చినప్పటికీ తదుపరిగా వేరే వారికి ఇవ్వడం తనని చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ ఆ బాధ బయట పెట్టలేదు..తాను ఎవరు చేయని ఒక సాహసం చేశాను హైదరాబాద్- విశాఖపట్నం విమానంలో చంద్రబాబు కోసం సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డ్లతో చాలా నిరసనలను కూడా తెలియజేశాను. బాబు జైలులో ఉండంగా చాలా బాధపడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో చోట్ల నిరసనలు చేశాను. దీని ఫలితంగా తను ఎన్నో కేసులలో ఇరుక్కున్నానని తెలిపారు. కానీ చివరికి తాను నమ్ముకున్న పార్టీ తనను గుర్తిస్తుందని నమ్మకం కూడా పోయింది.. లోకేష్ యువగళం పాదయాత్రలో  తన వంతు కృషి సాయశక్తుల ప్రయత్నించాను తన ఆర్థిక స్థితి కూడా బాగాలేకున్న అక్కడికి ప్రజలను పిలిపించి మరి యువనేతకు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారని భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఇలాంటివి చేశాను.. కానీ తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని చంద్రబాబుకు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: