సిబిఎన్ బర్త్ డే: రైతు కుటుంబంలో పుట్టి.. రాష్ట్రాన్నే పాలించిన నేత..!

Divya
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజున 74వ పుట్టినరోజు సందర్భంగా అటు కార్యకర్తలు ఇటు టిడిపి నే బాబు బర్తడే ని చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు.. ముఖ్యంగా  చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదిగిన తీరు గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. ఆరేళ్ల వయసులో  రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాపురం గ్రామానికి నడిచి వెళ్లి ప్రాథమిక విద్యా అభ్యసించారు. ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చంద్రగిరిలోని ప్రభుత్వ స్కూల్లో చదివారు. ఆ తర్వాత పదవ తరగతి tpm హై స్కూలులో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే తన సొంత ఊరులో వినాయక సంఘాన్ని ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి చేసే వారట. తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

కాలేజీ రోజుల్లోనే ఆయనలోని రాజకీయం మొదలయ్యింది. వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో పట్టా పొందారు. 1974లో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారు. మొదట చంద్రగిరి యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు. చంద్రబాబు  చేస్తున్న పనులను గుర్తించిన నాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. జనతా పార్టీ వల్ల గడ్డుకాలం పరిస్థితి ఉన్న సమయంలో చంద్రబాబు విజయం సాధించారు. కేవలం రెండేళ్లలోనే 1980లో పురావస్తు శాఖ ,సినిమాటోగ్రఫీ శాఖ, సాంకేతిక విద్య, పశుసంవర్ధన శాఖ  గా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

చంద్రబాబు మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ తనను తేనేటి విందును ఆహ్వానించారు. తొలి సమావేశంలోని చంద్రబాబు గారి తెలివితేటలు ప్రజల కోసం పరితపించే విధానాన్ని గుర్తించారు. ఫలితంగా 1981 సెప్టెంబర్ 10న భువనేశ్వరితో వివాహం జరిపించారు. ఎన్టీఆర్ కోరిక మేరకు చంద్రబాబు 1983 చివరిలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇక్కడినుంచి చంద్రబాబు జీవితంలో రాజకీయం మరో అధ్యాయం మొదలైంది. ఎన్టీఆర్ సహాయం రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు.

1984లో నాదెండ్ల భాస్కర్ రావు సృష్టించిన సంక్షోభాన్ని తిప్పి కొట్టడంలో చంద్రబాబు చూపిన వ్యూహరచన అమోఘమని చెప్పవచ్చు. 1989 ఎన్నికలలో టిడిపి ఓటమిపాలు అవ్వగా.. ఎన్టీఆర్ అవమానభారంతో శాసనసభకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో అసెంబ్లీ భారాన్ని మొత్తం చంద్రబాబు తన భుజాన వేసుకున్నారు. 1994 ఎన్నికలలో టిడిపి పార్టీ ఘనవిజయాన్ని అందుకుంది. కుప్పం నుంచి ఎన్నికైన చంద్రబాబు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆ సమయంలో పార్టీ నుంచి బయట వ్యక్తుల ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో.. పార్టీనీ కాపాడుకునేందుకు 160 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాస తీర్మానం పెట్టారు. 1995 సెప్టెంబర్ ఒకటిన తొలిసారిగా  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకు పాలన అనే అంతగా చేశారు. మూడు పదవులు వయసులోనే మంత్రి పదవి సంపాదించారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు చంద్రబాబు. విభజన రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచారు. అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి రాష్ట్రాన్ని పాలించే నేతగా ఎదిగారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: