పెద్ద దెబ్బే: అక్కా-చెల్లెళ్ళ హత్యా రాజకీయాలపై గూబ గుయ్యమనే కోర్టు తీర్పు !

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలవేళ రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారుతూనే ఉన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా  వైసిపి కూటమి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది.. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు కూడా మొదలయ్యింది.. ఇందుకు ముఖ్య కారణం మాజీ మంత్రి సీఎం జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యని అజెండాగా చూపించి.. కడప లోక్ సభ లో పీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ తో పాటు సీఎం జగన్ ను  టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో అటు వై.ఎస్ షర్మిల,  సునీతతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ హత్య పైన మాట్లాడుతూ ఉండడంతో ఇటీవల కోర్టులో దాఖలైన పిటీషన్ ను విచారించిన కడప కోర్టు ఈ రోజున పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేసింది.. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎవరూ కూడా వివేక హత్య కేసు పైన మాట్లాడకూడదంటూ అటు వైఎస్ షర్మిల , సునీత రెడ్డి తో పాటు చంద్రబాబు ,లోకేష్ , పవన్ కళ్యాణ్,  పురందేశ్వరి కి సైతం కడప కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

గత కొద్దిరోజులుగా ఎక్కువగా షర్మిల, చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవి, సునీత వంటి వారు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రాకులాడుతూ ఉండడంతో వైసిపి నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు.. దర్యాప్తులో ఉన్న కేసును సైతం ఎన్నికల ప్రలోభాల కోసం వాడుకోవాలని చూస్తూ ఉండడంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపైన స్పందించిన కడప కోర్టు.. ఎవరు కూడా వివేకానంద హత్య కేసు పైన మాట్లాడకూడదు అంటూ అందరికీ ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: