ఎన్నికలకు ముందు ఏలూరు ఎంపీ సీటు విషయంలో గందరగోళం..!

Pulgam Srinivas
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీలో దిగబోతున్నాయి. ఇలా వీరు ప్రకటించడంతోనే ఈ కూటమికి ఫుల్ మైలేజ్ వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడు అయితే సీట్ల పంపిణీ మొదలు అయ్యిందో అప్పటినుండే ఈ పార్టీకి పెద్ద సమస్య మొదలయ్యింది. కొన్ని ఏరియాల్లో సీట్లు అనుకున్న వ్యక్తులకు రాకపోవడంతో... ఇతర ఏరియా నుండి వారు పోటీ చేస్తాను అనడం... కొన్నింటికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ అన్ని సంవత్సరాలు పాటు పని చేసిన నాయకులు కొత్తగా వచ్చిన వారికి సపోర్ట్ చేయకపోవడంతో పార్టీ అధిష్టానానికి ఇది తీవ్ర సమస్యగా మారింది.

ఇక పార్టీ టికెట్ల విషయంలో టీడీపీ పెద్ద సమస్యగా మారిన వారిలో రఘు రామ కృష్ణం రాజు ఒకరు. ఈయన మొదట నరసాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ఏరియా అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారు. దానితో రఘురామ "బీజేపీ" కండువా మార్చి ఆ పార్టీ నుండి పోటీ చేద్దాం అనుకున్నాడు. కమలం పార్టీ మాత్రం అందుకు ఇతనికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దానితో ఈయన చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈయన ఏలూరు నుండి ఎంపీ గా పోటీ చేద్దాం అని డిసైడ్ అయ్యారు.

దానితో అక్కడి టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. నరసాపురం సీటు దక్కకపోవడంతో ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ సీటు కనక ఆయనకు వస్తదేమో అని వారు తెగ కంగారు పడ్డారు. కానీ క్యాస్ట్ క్యాలిక్యులేషన్ లో భాగంగా ఇక్కడ సీటు బీసీలకు దక్కింది. దానితో ఈ ఏరియాలో కూడా రఘు రామా కు సీట్ దక్కలేదు. ఇలా ఎక్కడి నుండి పోటీ చేద్దాం అన్న ఏదో ఒక అడ్డంకి ఎదురవడంతో ఈయన ప్రస్టేషన్ పీక్స్ కి చేరిపోయింది. దానితో ఈయన ఉండి పై కన్ను వేశాడు. ఉండి నుండి పోటీ చేస్తాను అని ఈయన బహిరంగంగానే అనౌన్స్ చేశాడు. ఇక అక్కడి సీటును శివరామరాజుకు అనౌన్స్ చేయడంతో ఈయన మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇక మళ్ళీ కొన్ని కొత్త పరిణామాలు తెరపైకి వచ్చాయి.

ఇలా ఈ ఏరియాలో సీట్ల కోసం అనేక మంది పోటీ పడుతూ ఉండడంతో నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణం రాజుకు ఇచ్చి ఉండి అసెంబ్లీ సీటును బీజేపీ కేటాయించాలి అనే ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక ఈ ప్రతిపాదనలో భాగంగా ఉండి సీటును తీసుకోవడానికి బీజేపీ సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఎంపీ సీట్ ను వదులుకొని ఎమ్మెల్యే సీటు తీసుకోవడానికి బీజేపీ నిరాకరించడంతో వారికి ఏలూరు ఎంపీ సీట్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుండి కమలం పార్టీ నేతలు ఈ సీటును ఆశిస్తూ వచ్చారు. కాకపోతే ఎలక్షన్ లు చాలా దగ్గరగా వచ్చాయి. మరి ఇలాంటి సమయంలో బీజేపీ ఏలూరు సీటును తీసుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: