ప్రచారానికి దూరంగా లోకేష్.. వైసీపీకి భయపడేనా?

Purushottham Vinay
•ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న లోకేష్ 

•సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఎక్కడా కనిపించని వైనం

•వైసీపీ విమర్శలకి లోకేష్ భయపడుతున్నారా?


నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నాడన్న  చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏండాదిన్నర ముందే యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టి హడావిడి చేసిన నారా లోకేష్ ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి శంఖారావం సభలు నిర్వహించారు.అవి కొన్ని జిల్లాలలో బాగానే సాగాయి.ఇక ఎన్నికల ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ చేస్తారని అనుకుంటున్న తరుణంలో లోకేష్ మాత్రం కేరాఫ్ మంగళగిరి అన్నట్లుగానే ఉన్నారు. ఆయన కనీసం టీడీపీ కూటమి సభలలో కూడా పాల్గొనడం లేదు. ఇంకా ఎక్కడా కనిపించడం లేదు. ఈ సభలలో చంద్రబాబు నాయుడు పవన్ మాత్రమే ఉంటున్నారు. లోకేష్ ఎందుకు స్టేట్ వైడ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న చర్చకు తెర లేస్తోంది.వైసీపీకి భయపడుతున్నారా అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.అయితే మంగళగిరిలో ఈసారి లోకేష్ కి అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఆయన అక్కడ ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారని కూడా అంటున్నారు.అక్కడ నుంచే ఆయన X కి పని చెప్పి విమర్శలు చేస్తున్నారు తప్ప మంగళగిరి దాటి రావడం లేదు.దాన్ని వైసీపీ నేతలయితే మరో రకంగా చెబుతున్నారు.


మంగళగిరిలో టైట్ పొజిషన్ ఉండడంతోనే లోకేష్ ఆ గడప దాటి రాలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తన ఒక్క సీటు చూసుకునే లోకేష్ ఇక రాష్ట్ర నాయకుడు ఎలా అవుతారని అంటున్నారు.అయితే టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేష్ ని మంగళగిరికి పరిమితం చేసింది అని కూడా అంటున్నారు. లోకేష్ వస్తే ఆయన మీద వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడతారని చంద్రబాబు కాదు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని కూడా కొత్త ప్రచారానికి తెర తీస్తారని అంటున్నారు. నిజానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్న మాట కూడా విపిస్తుంది.టీడీపీ అధికారంలోకి వస్తే కనుక అయిదేళ్ళ పాటు చంద్రబాబు నాయుడు పాలిస్తారా అన్న డౌట్లూ కూడా వస్తున్నాయి. లోకేష్ కి మధ్యలో పట్టాభిషేకం చేస్తారని రూమర్స్ పాస్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. దాంతో లోకేష్ ని కేవలం ఎమ్మెల్యే అభ్యర్ధిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తునారని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ ఇప్పుడు ఇలా ప్రచారానికి దూరం ఉండటం హాట్ టాపిక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: