ఏపీ : సినీ నిర్మాతను జీరో చేయబోతున్న కాంగ్రెస్.?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన గుర్తింపును అలాగే ఉనికిని కోల్పోయింది.గత పది సంవత్సరాల నుండి అధికారాన్ని కోల్పోయి అసలు ప్రజలు కాంగ్రెస్ అంటూ ఒకటి ఉందని మర్చిపోయే స్టేజిలో ఆ పార్టీ ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ మరియు టీడీపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేసేసారు. కానీ కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ఖరారు చేయలేదు.దాంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థులకు సంబంధించి రెండో లిస్ట్ ఇటీవల విడుదల చేసింది.ఆ లిస్ట్ ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు.దాంట్లో విశాఖకు సంబందించి ఎంపీ అలాగే భీమిలి, దక్షిణం, గాజువాక అసెంబ్లీ స్థానాలను ఖరారు చేసింది.అయితే ఎంపీ టికెట్ ను సినీ నిర్మాత ఐనా పులుసు సత్యనారాయణ రెడ్డికు పార్టీ అధిష్టానం కేటాయించింది.ఆయన గుంటూరు జిల్లా వాసి అయినప్పటికీ విశాఖలో స్థిరపడ్డారు.ఆయన తెలుగు సేనా పార్టీని స్థాపించి తర్వాత దాన్ని కాంగ్రెస్ లో కలిపి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న అనేక సినిమాలు తీశారు.దాంట్లో భాగంగానే విశాఖ ప్రైవేటికరణను నిరసిస్తూ ‘ఉక్కు సత్యాగ్రహం’ మూవీను తెరకెక్కించారు.ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా నిర్మాత గా వ్యవహారించారు.
కాకపోతే ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఉనికి కరువు అయ్యింది.ఆ పార్టీ జనసేన కంటే కూడా దారుణంగా పడిపోయింది అనే చెప్పాలి. అయితే ఇటీవల వైయస్ కూతురు, సీఎం జగన్ చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో చేరి ఆ పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని లీడ్ లోకి తీసుకురాడానికి కృషి చేస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో గుర్తింపు అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.షర్మిల ఆ పార్టీని విడాకుండా అదే పార్టీలో కొనసాగితే మాత్రం 2029 ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందే ఛాన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. చూడాలి మరీ ఆమె ఆ పార్టీలో అలాగే కొనసాగుతారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: