ఏపీ: ఆరునూరైనా రాబోయే ఎన్నికల్లో గెలిచేది తనే: వేణు స్వామి

Suma Kallamadi
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలియని వారు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ ఉండరు. ఓ వైపు సినిమా హీరోలమీద, మరోవైపు రాజకీయ నాయకులమీద జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి ఇక్కడ బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో గతంలో ఆయన వివిధ రకాల వ్యక్తుల మీద చెప్పిన జ్యోతిష్యం సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఇక ఏపీలో రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎలాగైనా గద్దెదింపాలని కూటమి ట్రై చేస్తుంటే, మరోవైపు మరలా గద్దెనెక్కాలని జగన్ తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ ముందుకు పోతున్నాడు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ - కమ్యునిస్టులు జత కట్టి జగన్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఇలాంటి స్థితిలో కూడా ఎవరు ఎన్ని గ్రూపులు కట్టినా రానున్న ఎన్నికల్లో విజయం తమదే అని వైసీపీ నాయుకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా చెబితే పలు సర్వేలు కూటమికి అనుకూలంగా ఫలితాలు చెబుతున్నాయి. ఈ సమయంలో వేణు స్వామి తెరపైకి వచ్చి ఏపీలో ఎన్నికల ఫలితాలపైన, మంత్రుల విజయవకాశాలపైనా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, ఆరునూరైనా రానున్న ఎన్నికల్లో ఆంధ్రాలో గెలిచేది జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. దానికి జాతకాన్ని ఆయన వివరిస్తూ... జగన్ రాశి, నక్షత్రాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో కొంతమంది మంత్రులపైనా వేణుస్వామి స్పందించడం కొసమెరుపు. ఇందులో భాగంగా... రోజా, అంబటి, అమర్నాథ్ గురించి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వీరు బాగా కష్టపడాలని, ఆయా నియోజకవర్గాల్లో వారికీ టఫ్ ఫైట్ ఉండబోతుందని విశ్లేషించారు.
అయితే వీరి గెలుపోటములపై మాత్రం వేణు స్వామి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు! ఇదే సమయంలో నెల్లూరు ఎంపీ స్థానంపైనా వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఈ సారి నెల్లూరు లోక్ సభ స్థానం విషయంలో ఫైట్ చాలా తీవ్రంగా ఉంటుందని స్పందించారు. ఇందులో భాగంగానే నెల్లూరు ఎంపీ స్థానం కోసం వైసీపీ నుంచి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య పోటీలో జాతకం ప్రకారం సాయిరెడ్డికి పది శాతం వరకు మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుందని అంచనాగా చెప్పారు. అయితే ఏది ఏమైనా... రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపు మాత్రం ఎవ్వరూ మార్చలేరని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: