ఏపీ: అన్న జగన్ రెడ్డిపై దారుణమైన ఆరోపణ చేసిన చెల్లెలు షర్మిల?

Suma Kallamadi
ఎన్నికల వేళ ఏపీ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలోనే చాలా నాటకీయ మలుపులు తిరుగుతున్న రాజకీయ వ్యవస్థగా పేరు గడిస్తోంది. అవును, గడిచిన దశాబ్ద కాలంలో ఎప్పుడూ కనిపించని ఎన్నో అంశాలు తాజా ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. దానికి కారణం ఇక్కడి కుటుంబ రాజకీయాలు. ఏ రాష్ట్రంలో అయినా సొంత కుటుంబం అనేది సపోర్ట్ రాజకీయం చేస్తుంది గానీ ఇక్కడ ఒక్క చోటే కుటుంబ రాజకీయాలు అనేవి యుటర్న్ తీసుకొని కొత్త మలుపులు తిప్పుతున్నాయి.
సరిగా పదేళ్ల క్రితం జగనన్న విడిచిన బాణం అంటూ చెల్లెలు షర్మిల రాజకీయ బరిలో దిగి తనదైన ఓర్పు, నేర్పుతో అన్నకు తగ్గ చెల్లిగా పేరు తెచ్చుకొని బాగా సపోర్ట్ ఇచ్చింది. అధికార పార్టీ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి చాలా కారణాలు... అందులో షర్మిలమ్మ చాలా కీలక పాత్ర పోషించిందని అందరికీ తెలిసినదే. ఇపుడు అదే షర్మిల జగన్ పై నిప్పులు చెరుగుతోంది. దానికి గల ప్రధాన కారణం... జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే తల్లి, చెల్లిని విస్మరించడమే అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ జగన్ ను ఉద్దేశించి ఎవరూ అనని మాటల్ని షర్మిల అనటం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఆమె కడప జిల్లా కమలాపురంలో బస్సు యాత్రను నిర్వహించగా అక్కడికి వేలమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసి అన్న జగన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ... "ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుంభ కర్ణుడి మాదిరి నాలుగున్నర సంవత్సరాలు నిద్రావస్థలో ఉండి సరిగా ఎన్నికలకు 6 నెలల ముందు నిద్ర లేచి వేదాలు వల్లిస్తున్నాడు. ఆయన పాలనంతా అక్రమాలు, రౌడీయిజం, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా హత్యలు, దోపిడీలు, దొంగతనాలతో నిండిపోయింది. మచ్చుకైనా ఏపీలో డెవలప్ మెంట్ కనబడడం లేదు. తండ్రి వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టుల ఊసేలేదు.. పైగా కడప స్టీల్ ఫ్యాక్టరీ వైఎస్ కలగా మార్చుకున్నారు. అదే స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి అయి ఉంటే ప్రత్యక్షంగా 25000 మందికి, పరోక్షంగా... మరో 22000 మందికి ఉద్యోగాలు వచ్చేవి!" కాబట్టి జనాలు ఆలోచించుకోండి... ఇలాంటి రాక్షసుడికా మనం పట్టం కట్టేది? అని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: