
ఏపీ: వైసీపీ పార్టీలో విశ్వాసఘాతకులు.. ఇలాంటి ప్లేట్ ఫిరాయింపు నెవర్ బిఫోర్..?
వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన నేత మాజీ పోలీసు అధికారి మహమ్మద్ ఇక్బాల్. మహమ్మద్ ఇక్బాల్‌ను వైసీపీ రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిపించింది. 2019లో వైసీపీ తరపున పోటీ చేసే ఓటమి పాలయ్యారు. 2024లో మరోసారి టికెట్‌ను ఎక్స్‌పెక్ట్ చేశారు కానీ వైసీపీ అతను ఓడిపోతాడనే భయంతో సీటు ఇవ్వలేదు. దాంతో టీడీపీలో జాయిన్ అయ్యారు.
మరో నేత జంగా కృష్ణమూర్తి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 2025 వరకు జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంటుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టికెట్ తనకు కాకుండా వేరే వారికి ఇచ్చారు అనే ఒకే కారణంతో విశ్వాసఘాతకులుగా మారారు. జోక్ ఏంటంటే టీడీపీలో చేరిన ఇతనికి ఎలాంటి టికెట్ దక్కలేదు.
ఇక రామచంద్రయ్యను 2019 తర్వాత జగన్ చేరదీసి మరీ ఎమ్మెల్సీ పదవిని అందించారు. అయితే అతను ఈసారి టికెట్ ఇవ్వలేదని వైసీపీకి వ్యతిరేకమయ్యారు ఈయనకు రాజకీయాల్లో గెలిచిన చరిత్ర ఉంది. జగన్ అధిష్టానం కోటం రెడ్డికి రెండుసార్లు టికెట్లు ఇచ్చి గెలిపించింది. కానీ అతనికి ఏమాత్రం విశ్వాసం లేదు అందుకే జగన్‌కు వ్యతిరేకంగా క్యాంపెనింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఉండవల్లి శ్రీదేవి కూడా వైసీపీ కారణంగా చాలానే ప్రయోజనాలు పొందారు కానీ అవన్నీ మరిచి ఇప్పుడు చాలా కొత్త మనిషి లాగా ప్రవర్తిస్తున్నారు. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే వీరందరికీ పెద్ద షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ప్లేట్ ఫిరాయించినందుకు చివరికి వారికే చిల్లు పడే అవకాశం ఉంది.