చంద్రబాబు: వడదెబ్బను మించిపోయేలా పింఛన్ల దెబ్బ?

Chakravarthi Kalyan
కొన్ని రోజులుగా ఆంధ్రా రాజకీయం మొత్తం పింఛన్ల చుట్టూనే తిరుగుతుంది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ అంశంపై మినీ వార్ నడుస్తోంది. మాటల తూటాలతో నిరంతరం ఇరు పార్టీల నాయకులు దాడి చేస్తున్నారు. పింఛన్లు ఆపించి అవ్వాతాతలను హింసిస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు దుర్మార్గుడు అని జగన్ అంటుంటే…

నిధులు లేక పింఛన్లు ఆపి తమపై నిందలు మోపుతున్నారని.. వాలంటీర్లను తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలన్న ఉద్దేశంతో వీళ్లు లేకపోతే.. పింఛన్లు ఇవ్వలేమని సీఎం జగన్ చేతులు ఎత్తేస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.  అయితే ప్రభుత్వ పథకాల అమలుకు దూరంగా ఉంచాలని ఈసీకి ఫిర్యాదు చేసింది చంద్రబాబు నమ్మదగిన, అనుకూల వ్యక్తి అయిన.. సిటిజన్ ఫర్ డెమో క్రసీ అనే సంస్థ కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇలా అడ్డంగా దొరికిపోయినా కూడా ఇంకా చంద్రబాబుని వెనుకేసుకొద్దామని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కవర్ చేస్తూ వార్తా కథనాలు ప్రచురిస్తోంది.

తాజాగా ఏప్రిల్ పింఛన్ల పంపిణీని కావాలనే జగన్ జాప్యం చేశారు. ఖజానాలో ఉన్న సొమ్మును అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. పింఛన్ల కు నిధుల విడుదలను ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేశారు. ఇళ్ల వద్దనే పింఛన్ అందించడానికే సచివాలయ ఉద్యోగులు ఉన్నా చర్యలు తీసుకోలేదు. అసలు ఈ బాధ్యత తనది కాదన్నట్లు జగన్ కక్ష కట్టి వ్యవహరించారు. ఇప్పుడు అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు.  

రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే. సొంతూరిలోనే కాక ఎక్కడైనా పింఛన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అంటూ రాసుకొచ్చారు.  జగన్ పాదయాత్ర సందర్భంగా రెండు వేల పింఛన్ హామీ ఇస్తే దానిని కాపీ కొట్టి హడావుడిగా రూ. వెయ్యి ఉన్న దానిని చంద్రబాబు రెండు వేలకు పెంచారు.  దీంతో పాటు జగన్ ఇంటికే తీసుకువచ్చి డబ్బులను అందజేస్తున్నారు. ఎవరి హయాంలో వృద్ధులకు న్యాయం జరిగిందో వారి దగ్గరకి వెళ్లి అడిగితే తెలుస్తుందని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: