కర్నూలు : శబరి వర్సెస్ బ్రహ్మానందరెడ్డి.. నంద్యాల తీర్పు అలా ఉండబోతుందా?

Reddy P Rajasekhar
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన బ్రహ్మానందరెడ్డి మరోమారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. మరోసారి ఎంపీగా గెలిచి నంద్యాల అభివృద్ధి కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
 
తెలుగుదేశం పార్టీ తరపున బైరెడ్డి శబరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా తాను కచ్చితంగా ఎంపీగా విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన బైరెడ్డి శబరికి స్థానికంగా మంచి పేరు ఉంది. నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీకే అనుకూల ఫలితం వచ్చే ఛాన్స్ అయితే ఉందని కొన్ని సర్వేలు చెబుతుండటం గమనార్హం.
 
గత నెల 16వ తేదీన టీడీపీలో చేరిన బైరెడ్డి శబరి ఎంపీ టికెట్ సాధించడంతో పాటు విజయం విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.. సీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల కోసం చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు ప్లస్ కానున్నాయని చెప్పవచ్చు.
 
రాయలసీమ వైసీపీకి కంచుకోట కాగా ఇక్కడి ప్రజలు మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. జగన్ వేవ్ తో పోచా బ్రహ్మానందరెడ్డికి అనుకూలంగా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే బైరెడ్డి శబరి ప్రచారం హోరెత్తిస్తూ గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. మే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనుండగా ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: