ఇట్టాగైతే.. ఎట్టా బీజేపీ గెలిచేది.. కిషనన్న జర సొంచో?

praveen
ఆప్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో ప్రస్తుతం బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు సాగుతోంది. తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా ఎన్నో రోజుల నుంచి పావులు కదుపుతున్న బిజెపి.. ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో  డబుల్ డిజిట్ సీట్లు సాధించడం పైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పరిస్థితులను బట్టి దూకుడుగా ముందుకు సాగుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం బిజెపి అభ్యర్థుల తీరు మాత్రం ఏకంగా కమలం పార్టీలో కలవరం రేపుతుంది.

 హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత తీరు కూడా ఇలాగే హాట్ టాపిక్ గా మారిపోయింది. హైదరాబాద్ ఆ పార్లమెంట్ స్థానాన్ని మజిలీస్ పార్టీ కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో పార్టీలు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కసారి కూడా ఏ పార్టీ విజయం సాధించలేదు  ఒక రకంగా ఇతర పార్టీలకు ఏకంగా డిపాజిట్లు కూడా గల్లంత అవుతూ ఉంటాయ్. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ సైతం మజిలీస్ పార్టీతో దోస్తీ చేసింది తప్ప ఆ పార్టీని ఓడగోట్టాలని మాత్రం అనుకోలేదు. కానీ ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా మాధవి లతను బరిలోకి దింపింది.

 పూర్తిగా హిందుత్వ భావాలు కలిగిన ఆమె సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రసంగాల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హైదరాబాద్లో బిజెపి గెలుస్తుందా అంటే అందరూ అనుమాన పడుతున్నారట. ఎందుకంటే ఇక బిజెపి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా మాధవి లత ఆచితూచి మాట్లాడుతుందనుకుంటే.. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఆమె గెలుపుకు గండి కొట్టడమే కాదు పార్టీనీ ఇరకాటంలో పెట్టేలాగే ఉన్నాయట. ఇక మరోవైపు ఆమె అభ్యర్థిత్వంపై హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న బలమైన నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సాహ మిగతా కీలక నేతలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారట.  ఇలా కీలక నేతలు ప్రచారానికి దూరంగా ఉండడం.. ఇక మాధవి లత కొన్నిచోట్ల నోరు జారుతున్నట్లు మాట్లాడుతుండడంతో.. బిజెపి గెలుస్తుందా లేదా అనే అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. మరోవైపు ఆమె విరించి హాస్పిటల్స్ ద్వారా ఎక్కువ బిల్లులు వసూలు చేస్తూ ప్రజల రక్తం తాగారు అనే నెగెటివిటీ కూడా సోషల్ మీడియాలో వస్తుందట. ఇలాంటి పరిస్థితులు మధ్య తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. ఇక పార్టీ నేతలు అందరి మధ్య  మధ్య ఐక్యత తేవడమే కాదు ప్రచార  రంగంలో అనుసరించాల్సిన వ్యూహాలపై   మాధవి లతకు పలు సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని బిజెపి శ్రేణులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: