నాగరాజు వర్సెస్ బీవై రామయ్య.. కర్నూలు ఎంపీగా గెలిచేది ఆయనేనా?
బీవై రామయ్య కర్నూలు మేయర్ గా పని చేశారు. స్థానిక ప్రజల్లో బీవై రామయ్యకు మంచి పేరు ఉంది. కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు(ఎస్సీ), మంత్రాలయం, పత్తికొండ శాసనసభ నియోజకవర్గాలు కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో ఉన్నాయి. 2014లో కర్నూలు ఎంపీగా వైసీపీ నుంచి బుట్టా రేణుక ఎన్నిక కాగా 2019లో వైసీపీ నుంచి సంజీవ్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు.
కర్నూలు లోక్ సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజుకు సైతం స్థానికంగా మంచి పేరుంది. అయితే కర్నూలు లోక్ సభ స్థానంలో టీడీపీకి గత రెండు దశాబ్దాలలో ఎప్పుడూ అనుకూల ఫలితాలు రాలేదు. ప్రస్తుతం కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీకే ఎడ్జ్ ఉంది. అటు బీవై రామయ్య ఇటు బస్తిపాటి నాగరాజు గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
భారీ మెజార్టీతో కర్నూలు లోక్ సభ స్థానంలో టీడీపీ గెలవబోతుందంటూ బస్తిపాటి నాగరాజు జోస్యం చెప్పారు. ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉండటంతో నాగరాజు, బీవై రామయ్య ప్రచారంలో వేగం పెంచారు. కర్నూలులో వైసీపీ హ్యాట్రిక్ సాధించాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. వైసీపీ సైతం కర్నూలు లోక్ సభ స్థానంపై చాలా ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది.