తిరుపతి (టీడీపీ): టికెట్టు చిక్కింది.. చిక్కుల్లో పడ్డ నేత..!

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధిష్టానాన్ని దక్కించుకోవడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలలో భారీగా పాపులారిటీ దక్కించుకున్న అభ్యర్థులకు టికెట్ ఇస్తూ అధిష్టానాలు సీట్లను పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టిడిపి అభ్యర్థిగా డాక్టర్ వీ. ఎమ్.థామస్ ను  ప్రకటించారు. అయితే తాజాగా థామస్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. థామస్ క్రైస్తవ మతం స్వీకరించారని ..ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా శుక్రవారం వెలుగు చూశాయి.. దీంతో ఇతనికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అంటూ కొన్ని హిందూ సంఘాలు న్యాయపోరాటం చేస్తున్నాయి.. అంతేకాదు వీరి పోరాటానికి మరింత బలం చేకూరేలా తమిళనాడులో థామస్ మత మార్పిడికి సంబంధించిన గెజిట్ ఆధారాలు కూడా లభ్యమైనట్టు సమాచారం.
డాక్టర్ వి.ఎం.థామస్ అసలు పేరు వడింగాడు మునస్వామి.. అయితే తాను క్రిస్టియన్ మతం స్వీకరించి వి.ఎం.థామస్ గా పేరు మార్చుకున్నారు. 2011 జూన్ 10న మతంతో పాటు పేరుని కూడా మార్చుకున్నట్లు 2012 అక్టోబర్ 17న తమిళనాడు ప్రభుత్వ గెజిట్లో ప్రకటించడం జరిగింది. తాను 1974 జూన్ 28న చెన్నైలో జన్మించినట్లు ఆయన తెలిపారు. మతం మార్పిడి పై కొందరు విమర్శలు చేయడంతో ఆయన జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 23వ తేదీన వీ.ఎం.థామస్ అయిన తన పేరును వడింగాడు మునస్వామి థామస్ గా కూడా పిలవవచ్చు అని మళ్లీ గెజిట్లో ప్రకటించారు..
తాను పేరు మాత్రమే మార్చుకున్నానని, మతం మార్చలేదని బుకాయిస్తున్నారు అంటూ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. చివరికి టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. క్రైస్తవ మతం స్వీకరించిన ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని జై హింద్ పార్టీ నాయకుడు అక్కిలిగుంట మధు హైకోర్టులో కేసు రిట్ పిటిషన్ దాఖలు చేయగా చిత్తూరు కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేశారు.. నామినేషన్ల పరిశీలన సమయంలో ఆధారాలన్నీ సమర్పించి ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు అధికార పార్టీ పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతుండగా ఇప్పుడు థామస్ వ్యవహారంపై జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం గా మారింది.. అంతేకాదు థామస్ వ్యవహారం పై సమగ్ర విచారణ జరపాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. ఇకపోతే టిడిపి తరఫున అభ్యర్థిగా ప్రకటించగా తనకు టికెట్ లభించిందని సంతోషించే లోపే ఈ మతమార్పిడి ఆయనను చిక్కుల్లో తోసేసింది.. మరి ఈ సమస్య నుంచి థామస్ ఎలా బయటపడతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: