జగన్ కుట్రకు బలైన IPSని ఈసీ ఆదుకుంటుందా?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేయడం ఖాయమని బాగా ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు కానీ అది ఇంచార్జ్ హోదాలోనే ఉన్నారు. ఆయన పర్మినెంట్ డీజీపీ మాత్రం కాదు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆయనను సీనియార్టీ లిస్టులో ఎక్కడో ఉంటే తెచ్చి డీజీపీగా పెట్టుకున్నారు. యూపీఎస్సీ రూల్స్ ప్రకారం.. కొత్త డీజీపీ నియామకానికి పేర్లు పంపాల్సి ఉన్నా కూడా పంపలేదు. యూపీఎస్సీ అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం పట్టించుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇంచార్జ్ డీజీపీ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం మాత్రం కనిపించడం లేదు.ఆయనను తప్పిస్తే.. సీనియర్ ఐపీఎస్‌ల లిస్టులో ఏబీ వెంకటేశ్వరరావు ముందు ఉంటారు. కానీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గత నాలుగేళ్ల నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన చేసిన తప్పేమిటో అసలు నిరూపించలేదు. ఇంకా ఆయనపై పెట్టిన కేసుల్ని నిరూపించలేదు. పైగా ఆయనపై కుట్ర చేశారన్నదానికి ఆధారాలను కూడా ఆయన కోర్టుకు..క్యాట్ కు సమర్పించడం జరిగింది.


 సస్పెన్షన్ ఎత్తి వేయాలని హైకోర్టు.. సుప్రీంకోర్టు చెప్పినా కూడా సస్పెన్షన్ ఎత్తి వేసి.. మళ్లీ సస్పెన్షన్ వేటు వేశారు. ఇదంతా కూడా ఓ కుట్ర ప్రకారం జరిగింది. ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఫారసు చేసింది.అయితే ఆయన తప్పేమీ చేయలేదని దాన్ని కేంద్రం తోసి పుచ్చింది. ఈ నెల 13 వ తేదీన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ క్యాట్‌లో ఏబీవీ సస్పెన్షన్ పై విచారణ జరుగుతుంది. ఆ రోజున సస్పెన్షన్ ఎత్తి వేస్తూ క్యాట్ నిర్ణయం తీసుకుని ఆయనకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలనుకుంటే… సీన్ అంతా కూడా మారిపోతుంది. డీజీపీని ట్రాన్స్ఫర్ చేశాక .. సీనియర్ల పేర్లు పంపాల్సి ఉంటుంది. ఆ సీనియర్లలో ఫస్ట్ పేరు ఏబీ వెంకటేశ్వరరావుది ఉంటుంది. ఏబీవీ రిటైర్మెంట్ మే నెలాఖరులో ఉంది. అయితే అప్పటికీ ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: