నెల్లూరు : కాకరేపుతున్న సూళ్లురుపేట రాజకీయం.. గెలుపెవరిది..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఎన్నికల హడావుడి మొదలవడంతో అధికార, ప్రతి పక్ష పార్టీలు ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి.. ఈ సారి అధికారం చేపట్టి పట్టు నిలుపుకోవాలని ఇరు పార్టీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు.. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరుగుతుంది.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన సూళ్లురుపేట రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుండే ఈ సెగ్మెంట్‌లో రెండు ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు సూళ్లూరుపేటలో వుంటాయి. అలాగే భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది.

1
962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటైన సూళ్లూరుపేట ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం మొదటిలో కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు  మరియు వైసీపీ రెండు సార్లు గెలిచాయి..గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య టీడీపీ అభ్యర్ధి పారాస వెంకట రత్నంపై 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే సూళ్లూరుపేటలో ఈ సారి కూడా భారీ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ గట్టి నమ్మకంతో వున్నారు. మరోసారి వైసీపీ అభ్యర్థి గా సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. 

ఈ ఐదు సంవత్సరాలలో  చేసిన సంక్షేమం,అభివృద్ధే తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిలో భాగంగా నెలవెల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ ను కేటాయించారు. నియోజకవర్గంలో జగన్ పాలనపై వున్న తీవ్ర వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని విజయశ్రీ భావిస్తున్నారు. అలాగే టీడీపీ కూటమి ప్రజలకు ఇస్తున్న హామీలు ప్రజలలోకి తీసుకెళ్ళుందుకు ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు.. ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీ సరికొత్త వ్యూహాలను రచిస్తుంది.. దీనితో ఈసారి సూళ్లూరుపేట నియోజకవర్గం ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠత ప్రజలలో నెలకొంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: