కర్నూలు : బాలనాగిరెడ్డి వర్సెస్ రాఘవేంద్ర.. మంత్రాలయంలో ఎవరి సత్తా ఎంత?

Reddy P Rajasekhar
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాలలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి బాల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వడంపై గతంలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున
పోటీ చేసి ఓడిపోయిన తిక్కారెడ్డి ఫైర్ అవుతున్నారు.
 
రాఘవేంద్ర రెడ్డి పేరులో రెడ్డి ఉన్నప్పటికీ ఆయన బీసీ అభ్యర్థి కావడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది.  రాఘవేంద్ర రెడ్డి బాలనాగిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తిక్కారెడ్డి టీడీపీ తరపున టికెట్ పొందిన రాఘవేంద్ర రెడ్డి వైసీపీ కోవర్ట్ అనే ముద్ర వేయడం గమనార్హం.
 
ఈ కామెంట్ల గురించి రాఘవేంద్ర రెడ్డి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు. వైసీపీకే ఎడ్జ్ ఉన్న మంత్రాలయంలో ఇరువురు నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మూడు టికెట్లను టీడీపీ అమ్ముకుందని బ్రోకర్ల మాటలు విని చంద్రబాబు మోసం చేశారని ఆయన అన్నారు. తిక్కారెడ్డి మద్దతు ఉండి ఉంటే రాఘవేంద్ర రెడ్డికి కచ్చితంగా ప్లస్ అయ్యేది.
 
కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల టికెట్ల ఎంపికలో టీడీపీ తప్పటడుగులు వేసిందని ఓటర్లకు పెద్దగా పరిచయం లేని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి వైసీపీ గెలుపునకు టీడీపీ కారణమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు కర్నూలు జిల్లాలో మరోసారి షాకింగ్ ఫలితాలు అయితే తప్పవని తెలుస్తోంది. రాయలసీమలో కనీసం 35 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటే ఛాన్స్ అయితే ఉందని భోగట్టా. మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా 15 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా కెరీర్ ను కొనసాగించారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: