విశాఖ: దారుణంగా ఉన్న గుడివాడ పరిస్థితి?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వీఐపీ నియోజకవర్గాల్లో విశాఖలోని గాజువాక కూడా ఒకటి. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేశారు. ముక్కోణపు పోటీలో వైసీపీ  విజయం సాధించింది. ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతం… దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గం… స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, ఆటోనగర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌తో గాజువాక పారిశ్రామికంగా చాలా డెవలప్ అయ్యింది. అంతేకాదు జాతీయ రహదారి పొడవునా విస్తరించిన ఈ నియోజకవర్గం ఆర్థికంగా రాష్ట్రానికి చాలా మంచిది.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులతోపాటు, ఆటోనగర్‌ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఓట్లు ఎక్కువగా ఉండే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున పల్లా శ్రీనివాస్, వైసీపీ తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ పడుతున్నారు.


పల్లా శ్రీనివాసరావు విషయానికి వస్తే గాజువాకలో బలమైన అభ్యర్థిగా నిలబడ్డారు. వైసీపీ నుంచి ఆయనకు మేయర్ ఆఫర్ వచ్చినా ఇంకా ఆస్తులపై దాడులు చేసినా పార్టీ ఏమాత్రం మారలేదు. అందువల్ల టీడీపీ పల్లా శ్రీనివాస్‌కు చాన్సు ఇచ్చింది.పల్లా జనసేనను కూడా  కలుపుకుని వెళ్తున్నారు. వాస్తవానికి పల్లా శ్రీనివాస్ రాజకీయ జీవితం పీఆర్పీ నుంచే ప్రారంభమయింది. 2009లో పీఆర్పీ ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేశారు. అందువల్ల ఇప్పుడు ఆయనపై జనసేన క్యాడర్ లోనూ వ్యతిరేకత లేదు.


గుడివాడ విషయానికి వస్తే వైసీపీ తరపున అభ్యర్థిగా అనేక సందేహాలు, వడపోతల తర్వాత ఆయనకు సీటు ఇచ్చారు. గాజువాక ప్రాంతంలోనే నివాసం ఉండే గుడివాడ అమర్నాథ్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. రెండో విడతలో మంత్రిగా అవకాశం పొంది రెండేళ్లుగా అధికారంలో ఉన్నారు. అయితే అనకాపల్లి నుంచి బదిలీ చేశారు. కానీ ఎక్కడో చోట సీటు వస్తుందని ఆశ పెట్టుకున్నారు. చివరికి తాను తన మిత్రుడు  వరికూటి చందును సమన్వయకర్తగా నియమింపచేసిన సీటులోనే పోటీ చేయాల్సి వస్తోంది. అందుచేత ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మిత్రుడు వరికూటి చందు సపోర్ట్ కోల్పోయారు. వారు గుడివాడ అమర్నాథ్‌ కి ఇంత వరకూ బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు.


గుడివాడ అమర్నాథ్ కాపు సామాజికవర్గానికి చెందిన నేత.కానీ పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆ వర్గంలో ఆయనపై సానుకూలత లేదు. దీన్ని గుర్తించే ఆయనకు వైసీపీ అధినాయకత్వం టిక్కెట్ ఇవ్వలేదు. కానీ అత్యంత విధేయుడికే హ్యాండిచ్చారన్న ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంలో తరువాత గాజువాకలో సర్దుబాటు చేశారు. కానీ అక్కడ గుడివాడ పరిస్థితి బాగలేదు. బాగా నెగటివ్ అయ్యారు. ఓడిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: