నేను తలుచుకుంటే.. కేసిఆర్ జైలు నుంచి బయటకు వచ్చేవాడా.. రేవంత్ కౌంటర్?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయం వాడి వేడిగా మారిపోయింది. అయితే ఇక ప్రస్తుత పరిస్థితులు దృశ్య తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుంది అని ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కావడం.. మరోవైపు కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతూ ఉండడం.. ఇంకోవైపు అటు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులను పగుళ్లు రావడంతో విమర్శలు వస్తూ ఉండడం లాంటి.. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కేసీఆర్. ఇలాంటి సమయంలో కీలక నేతలందరూ కూడా పార్టీని వీడుతూ ఉండడంతో వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

 ఇప్పటికే ఎంతోమంది బీఆర్ఎస్ నేతలు కారు దిగి కాంగ్రెస్కు చేరుకున్నారు. ఇందులో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు చేపట్టిన కడియం శ్రీహరి, కేకే లాంటి సీనియర్ నేతలు కూడా ఉండడం గమనార్హం. ఇలా రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో అటు రేవంత్ ప్రభుత్వం విమర్శలు గుప్పించడానికి ఏకంగా రైతుల ఆత్మహత్యలను తెరమీదకి తీసుకొచ్చారు కేసీఆర్. తమ ప్రభుత్వం హయాం  లో పాడిపంటలు బాగున్నాయని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికి అక్కడ పంటలు ఎండిపోయి కరువు వచ్చింది అంటూ కెసిఆర్ విమర్శలు చేశారు. అయితే ఇలాంటి విమర్శలపై రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

 కెసిఆర్ చేసిన పాపాలకే ఏడాది వానకాలం వానలు పడలేదని సీఎం రేవంత్ అన్నారు. అధికారం పోయాక బిడ్డ జైలుకు వెళ్లాక.. కేసీఆర్కు రైతులు గుర్తొచ్చారు. ఆయన పాపాలను సరిదిద్దడానికి కష్టపడుతున్నాం. పెండింగ్ పనుల కోసమే ఢిల్లీ వెళ్తున్నాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గలమెత్తితే మమ్మల్ని జైల్లో పెట్టారు. మేము కూడా అలాగే చేయాలనుకుంటే.. కెసిఆర్ జైలు నుంచి బయటకు వచ్చేవారు. కెసిఆర్ దోచుకున్న డబ్బు అంతా రైతులకు పంచిపెట్టి చేసిన పాపాలను కడుక్కోవాలి అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: