ఏపీ: ఏ పార్టీకి ఓటెయ్యాలో డిసైడ్ అయిపోయిన ఆంధ్ర ప్రజలు.. గెలిచేది ఎవరు..

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇందులో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవాలని ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు వివిధ రకాల అంచనాలు వేస్తున్నారు కానీ ఒక్కరు కూడా కచ్చితంగా ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పడం లేదు. నిజానికి ఎన్నికల్లో ఫలితాలు తారు మారయ్యే అవకాశాలు ఎక్కువ. రెండు మూడు నెలల సమయంలోనే ప్రజల్లో అభిప్రాయం మారిపోయి గెలవదు అనుకున్న పార్టీలు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సో, ఏపీలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం ఎవరి తరం కాదు కానీ ప్రజాభిప్రాయం ప్రకారం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. ధనిక మధ్య తరగతి పేద ప్రజలు వారి ప్రాధాన్యతల ప్రకారం ఓట్లు వేయాలని ఇప్పటికే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. కొందరు సంక్షేమ పథకాల కోసం జగన్ కి ఓట్లు వేయాలని ఆలోచిస్తున్నారు. మరికొందరు చంద్రబాబు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొస్తారేమో అని ఆశతో ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు.
కూటమిని చూసి కూడా ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయించుకున్న ప్రజలు కూడా ఉన్నారు. పొత్తు నచ్చకపోవడం వల్ల ఓట్లు వేయకూడదని డిసైడ్ అయిన ప్రజలు కూడా చాలా సంఖ్యలోనే ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లకు దగ్గర 40 రోజుల దాకా సమయం ఉంది. అయితే ఆల్రెడీ ఒక పార్టీకి వేయాలని డిసైడ్ అయిన ప్రజలు మళ్ళీ తమ ఒపీనియన్ మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. సో, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఫలితం అనేది ఒకే లాగా ఉంటుంది.
ఇకపోతే వైసీపీ ఈసారి గెలిచి ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేయాలని చూస్తోంది. వచ్చేసారి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కొనసాగకపోవచ్చు అతని లాంటి బలమైన నాయకుడు టీడీపీ దొరకకపోవచ్చు. ఈసారి విన్ అయితే వచ్చేసారి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి జగన్ తన సీఎం పదవి కాపాడుకుంటారో లేదో! మరో రెండు నెలల పవన్ కళ్యాణ్ భవితవ్యం కూడా తేల నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: