చంద్రబాబు: ఆ సొంత పార్టీ నేతలకు ఝలక్‌ ఇచ్చేస్తారా?

Chakravarthi Kalyan
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ సీట్లు, 17 ఎంపీ సీట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ అధినేత తాము పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం లో నిమగ్నం అయ్యారు. మొదటి జాబితాలో పెద్దగా ఆగ్రహ జ్వాలలు ఎదురు కాలేదు కానీ.. రెండు, మూడు జాబితాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తులు తమ నిరసన తెలిపారు.

అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  ఈక్రమంలో పార్టీ సీనియర్లు కొంతమంది పార్టీకి రాజీనామా చేస్తుండగా.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లలేక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నారు. ఇదిలా ఉండగా టికెట్ పొందిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ కూటమి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు టికెట్ పొందిన అభ్యర్థుల్లో కూడా మాకే బీఫాం వస్తుందా అనే సందిగ్ధంలో ఉన్నారు.  

దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. తాను అభ్యర్థులను ప్రకటించేశాను. ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత అభ్యర్థుల ప్రచార పర్వాన్ని, కలుపుకొని పోయే విధానాన్ని మరోసారి రివ్యూ చేస్తాను. ఇందులో వారు వెనుకబడి ఉంటే వారి స్థానంలో టికెట్లు వేరే వారికి ఇస్తాను అని ప్రకటించారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది.  

పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించినవి మార్చకపోవచ్చు కానీ.. సొంత పార్టీలో మార్పులు చేస్తారా అనేది చూడాలి. సత్యవేడు లో ఆదిమూల మాకు వద్దంటూ స్థానిక నేతలు ర్యాలీలు తీస్తున్నారు. మరి ఇక్కడ అభ్యర్థిని మారుస్తారా? అనంతపురం, గుంతకల్లు, చీపురుపల్లి లో ప్రకటించిన అభ్యర్థులు మాకు వద్దంటూ స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కాకపోతే వీరు ఆర్థికంగా బలవంతులు కావడంతో వీరిని మార్చే సాహసం టీడీపీ అధినేత చేయకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. తంబళ్లపల్లె, రాజంపేట, ఇంకా రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు ఇండియా హెరాల్డ్‌కు సమాచారం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: