ఏపీ : సోదరుడిపై పోటీకి సిద్దమైన షర్మిల.. కడప నుండి బరిలోకి.. ఫుల్ డీటెయిల్స్ ఇవే?

praveen
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో ఆంధ్ర రాజకీయం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అధికారంలో ఉన్న జగన్ ను గద్దె దింపేందుకు ఇప్పటికే టిడిపి జనసేన బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుంది. మరోవైపు ఏకంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితురాలు అయినా వైయస్ జగన్ సొంత చెల్లి షర్మిల సైతం అన్నను ఓడించేందుకు రెడీ అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఏకంగా ఆంధ్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది షర్మిల.

 ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ సొంత అన్న అని కూడా చూడకుండా.. ఏకంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఇక అన్న పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తూ ఉంది. అయితే ఇలా ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆమె ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఏకంగా సోదరుడి పైనే పోటీ చేసేందుకు సిద్ధమైంది వైయస్ షర్మిల.

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన వైయస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన సీఈసీ మీటింగ్లో ఏపీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థుల జాబితా పై చర్చలు జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. కాగా షర్మిల ఏకంగా సొంత సోదరుడి పైనే పోటీ చేసేందుకు సిద్ధమైంది. అయితే మరో 58 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు క్యాండెడ్లను ప్రకటించకుండా హోల్డ్ లో పెట్టింది కాంగ్రెస్.

 ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల వివరాలు చూసుకుంటే..
కడప నుంచి బరిలో YS షర్మిల
 రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు
 బాపట్ల నుంచి జెడి శీలం
కాకినాడ నుంచి పళ్ళం రాజు
 అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్
విశాఖ నుంచి సత్యారెడ్డి
ఏలూరు నుంచి లావణ్య
 రాజంపేట నుంచి నజీర్ అహ్మద్
 చిత్తూరు బరిలో చిట్టిబాబు
  హిందూపురం నుంచి షాహిన్
ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రఘువీరారెడ్డి.. మిగతా అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: