కర్నూలు : ప్రచారమే లేకుండా పవర్ వస్తుందా.. కోడుమూరులో గెలుపు ఆ అభ్యర్థిదేనా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అస్సలు కలిసిరాని నియోజకవర్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు కోడుమూరు నియోజకవర్గం అనే సమాధానం వినిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా వరుస షాకులు తగులుతున్నాయి. కేవలం ఒకే ఒక్కసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. 2024 ఎమ్మెల్యే ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ నుంచి బొగ్గుల దస్తగిరి వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్నారు.
 
విచిత్రం ఏంటంటే టీడీపీ అనుకూల సర్వేలలో సైతం కోడుమూరులో మరోసారి వైసీపీదే విజయమని వెల్లడైంది. ఆదిమూలపు సతీష్ ప్రణాళికాబద్ధంగా విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తుండటం ఆయనకు మరింత కలిసొస్తుంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన కోడుమూరులో గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. అయితే ఆదిమూలపు సతీష్ ఎమ్మెల్యేగా గెలవక ముందే ప్రజల సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
 
రోడ్లు, తాగునీటి సమస్యల వల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఇప్పటికే రోడ్లకు సంబంధించి కొన్నిచోట్ల పనులు మొదలుపెట్టి ఆదిమూలపు సతీష్ ప్రజలకు దగ్గరయ్యారు. బొగ్గుల దస్తగిరి మొదట్లో ఇంటింటా ప్రచారం చేసి ప్రచారం విషయంలో దూసుకెళ్లినా ప్రస్తుతం ఆయన ప్రచారం నత్తనడకన సాగుతోంది. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలపై కోడుమూరు నియోజకవర్గం ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది.
 
ఇక్కడ జగన్ ను చూసి వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆదిమూలపు సతీష్ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడతారని స్థానికులు చెబుతున్నారు. ఈయన ఆదిమూలపు సురేష్ సోదరుడు కావడం గమనార్హం. అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తూ ఏ సమస్య వచ్చినా తనను డైరెక్ట్ గా సంప్రదించాలని ఫోన్ నంబర్ ఇస్తూ కోడుమూరులో వైసీపీ విజయం సాధించడానికి ఆదిమూలపు సతీష్ సైతం తన వంతు కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: