రాయలసీమ: చంద్రబాబు భవిష్యత్తు అనంతపూర్ పై ఆధారపడిందా..?
అయితే 2019లో ఒకసారిగా సీన్ రివర్స్ అయ్యి కేవలం రెండు స్థానాలలో మాత్రమే విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా టిడిపి అధికారంలోకి రావాలి అంటే టిడిపి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీట్లను సాధించాల్సి ఉన్నది... కడప, కర్నూల్ ,నెల్లూరు, ప్రకాశం, అనంతపురం.. ఇతరత్రా జిల్లాల కంటే .. టిడిపి ఆశలు ఎక్కువగా అనంతపురం మీదే ఉన్నాయి.. ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు అనంతపురంలో టిడిపి పార్టీ పదికి పైగా అసెంబ్లీ సీట్లను సాధించాలి.. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోలేదట..
ఎప్పుడైతే టిడిపి పార్టీ పది అసెంబ్లీ స్థానాలను అనంతపురం జిల్లాలో సాధిస్తుందో అప్పుడు టిడిపి పార్టీకి అధికారం దక్కుతుంది.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలిచిన కూడా టిడిపి అధికారాన్ని దక్కించుకోలేదు..2004,2009 లో కూడా పదికి లోపల తక్కువ సీట్లు గెలిచి అధికారాన్ని అందుకోలేదు.. అయితే ఈసారి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో టిడిపి 10 అసెంబ్లీ సీట్లను దక్కించుకుంటుందా అంటే.. అసలు నమ్మకం కుదరలేదు.. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక ముందు టిడిపి పరిస్థితి ఎలా ఉందో కానీ అభ్యర్థుల ప్రకటన తర్వాత టిడిపిలో చాలా దుమారాలు రేగుతున్నాయి.. గుంతకల్లు, పుట్టపర్తి ఇలా ఏదో ఒక నియోజవర్గం నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి...
ఇండియా హెరాల్డ్ కు అందిస్తోన్న సమాచారం మేరకు.. గుంతకల్లులో టిడిపి పార్టీకి మంచి పట్టు ఉంది. 2014లో రెబల్ ను నిలబెట్టి మరీ గెలిచారు. ఇప్పుడు మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గమ్మనూరు జయరాములు అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో ఎన్నో ఆరోపణలు కూడా టీడీపీ పార్టీ పైన వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ని రోజులు టిడిపి పార్టీకి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడంతో అక్కడ టిడిపికి ఎదురు దెబ్బ పడబోతోంది. ఇక అనంతపూర్ అర్బన్ ప్రాంతాలలో కూడా టిడిపి గెలిచే సీటు కూడా ఒకటి.. ఇప్పుడు ఆ సీటును ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి ఇచ్చి.. అభ్యర్థిగా నిలబెట్టారు.. దీంతో అటు అనంతపూర్ అర్బన్ లో కూడా టిడిపిలో చిచ్చు కనిపిస్తోంది.
ధర్మవరం సీటు వచ్చేసరికి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి.. ఇక్కడ ఓడిపోవడంతో వెంటనే బిజెపిలోకి చేరారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ టిడిపి ఇన్చార్జిగా పనిచేశారు. కానీ ఇద్దరికీ టికెట్ ఇవ్వకుండా సత్యకుమార్ అనే ఒక స్థానికేతర వ్యక్తికి టికెట్ ఇచ్చారు.. అక్కడ కూడా టిడిపి పార్టీకి ఎదురు దెబ్బ తగులుతోంది. వీటితోపాటు టిడిపి కంచుకోటగా ఉన్న పెనుగొండ, రాప్తాడునియోజకవర్గాలలో కూడా ఎదురు దెబ్బ తగులుతోంది. అలాగే అనంతపూర్ ఎంపీ సీటుకు కురబలకు.. హిందూపూర్ ఎంపీ సీటు బోయ కేటగిరికి వైసిపి పార్టీ సీట్ కేటాయించింది.. దీని ప్రభావం కూడా చాలానే చూపుతోంది.. టిడిపి మాత్రం బీసీలకే ఎంపీ సీట్లు కేటాయించినా అంతగా గెలిచే అవకాశాలు లేవట. అలాగే మడకశిరలో సామాన్య వ్యక్తిని సింగనమలలో సామాన్య కార్యకర్తలను వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక కళ్యాణ్ దుర్గం లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులే వివాదాలకు ముఖ్య కారణమని కూడా చెప్పవచ్చు. తాడిపత్రిలో కూడా జేసీ కుటుంబానికి తప్ప మరో వ్యక్తికి అవకాశం లేదు.. పుట్టపర్తి పల్లె రఘునాథ రెడ్డి కోడలికి సీటు ఇవ్వడంతో ఆమె మొదటి రోజే వడదెబ్బ పాలయ్యింది.. దీంతో చాలామంది ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. మొత్తానికి గట్టి పోటీ ఇచ్చే సీట్లలో కూడా అభ్యర్థుల విషయంలో టిడిపి కాస్త వెనుకబడింది.. హిందూపురంలో మాత్రం టిడిపికి కాస్త కలిసి వచ్చిన ఉరవకొండలో గట్టి పోటీ కనిపిస్తోంది.. 14 అసెంబ్లీ సీట్లకు గాను అనంతపూర్ జిల్లాలో మొత్తం పది చోట్ల విజయం సాధిస్తుంది టిడిపి అధికారంలోకి వస్తుంది.. అని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం అయితే ఆ ఊపు కనిపించలేదు.