తెలంగాణ: కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియం శ్రీహరి.. ఆయనతో పాటు..?!

Suma Kallamadi
కాలం గడుస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో తండ్రీకూతుళ్లు హస్తం పార్టీ కండువను కప్పుకున్నారు.
 సీనియర్ నేత బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కావ్య మొదట్లో వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. అయితే, ఫోన్ ట్యాపింగ్, పార్టీలో అవినీతి ఆరోపణల కారణంగా ఆమె ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కావ్య బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావుకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎప్పుడు చేరారు? జాతీయ ఎన్నికలకు ముందు ఆదివారం అధికారిక చేరిక జరిగింది.
ఇక కాంగ్రెస్‌లో చేరిన ఇతర ప్రముఖుల గురించి తెలుసుకుంటే... కాంగ్రెస్ సీనియర్ నేత కేకేశరావు గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన తర్వాత  హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావ్యకు వరంగల్ ఎంపీ టిక్కెట్టును కాంగ్రెస్ ఆఫర్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్, చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి సహా కాంగ్రెస్‌లో పలువురు నేతలు చేరారు. బీఆర్‌ఎస్ వీటివల్ల చాలా బలహీనంగా తయారైంది.  ఇంతలో, ఇద్దరు BRS ఎంపీలు BB పాటిల్, P రాములు బీజేపీ వైపు మారారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరగనున్నాయి. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కీలక నేతలు పోకుండా బిఆర్ఎస్ అధిష్టానం ఆపలేకపోతోంది. ఇక కల్వకుంట్ల కవిత మద్యం పాలసీ కేసులో అరెస్టు అయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పార్టీ పతనం, మరోవైపు బిడ్డ జైలుకు వెళ్లడం వల్ల కేసీఆర్ బాగా మానసికంగా కృంగిపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: