కేసీఆర్ : పెద్దాయనకు.. అప్పుడు వద్దన్నోడే ఇప్పుడు దిక్కయ్యాడా?
కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు బిఆర్ఎస్ పార్టీకి కనీస అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికికారణం అటు కెసిఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన అటు కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక మరో బలమైన అభ్యర్థిని వెతుక్కోవడం కేసిఆర్ కి తలనొప్పిగా మారింది. అయితే ముందుగా పసునూరి దయాకర్ కు టికెట్ వస్తుందని ఆయన అనుకున్నారు. కానీ కెసిఆర్ పక్కన పెడుతున్నారు అని తెలియడంతో ఆయన వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అయితే దయాకర్ తప్పుకోవడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ అనుకున్న.. కెసిఆర్ కి ఇలాంటి ఆలోచన రావడానికి ముందే రమేష్ బిజెపిలో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే కడియం కావ్య బలమైన ప్రత్యర్థిగా నిలబడుతుంది అని కెసిఆర్ భావించారు. అయితే కడియం కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అనే వార్తలు నేపథ్యంలో వెంటనే ఇక కడియం కూతురికి ఎంపీ టికెట్ను కూడా ప్రకటించారు కానీ వర్కౌట్ కాలేదు. కడియం అతని కూతురుతో కలిసి కాంగ్రెస్కు చేరేందుకు రెడీ అయ్యారు. అయితే కడియం కోసం రాజయ్యను పక్కనపెట్టారు కేసీఆర్. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ హస్తం పార్టీ ఆయనను చేర్చుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది దీంతో అటు ఇటు కాకుండా ఉన్నారు. దీంతో రాజయ్యను మళ్ళీ పిలిచి ఆయనకే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అయితే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ప్రస్తుతం టికెట్ తనకు ఇవ్వాలి అంటూ ఆశిస్తూ ఉండడం గమనార్హం.