అమరావతి : బీజేపీకి చుక్కలు చూపిస్తాం అంటున్న మైనారిటీలు ....!!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు వచ్చే నెలలో రాబోతున్న తరుణంలో భాగంగా ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే వారి వారి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా బీజేపీ తరపున సుజనా చౌదరి చోటు సంపాదించారు.ఆయన 2014లో టీడీపీ తరపున కీలకంగా వ్యవహారించారు. అయితే అదే టీడీపీ నుండి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే 2014నుండి 2018 వరకు అప్పటి ఎన్దియే కూటమి నుండి కేంద్రమంత్రి గా చేసారు. ఆ తర్వాత 2019 లో పార్టీ పిరాయించి బీజేపీకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయనక 2024 ఎన్నికల్లో లోకసభకు ట్రై చేసారు కానీ అంతర్గత కారణాల వల్ల ఆ టికెట్ టీడీపీ అభ్యర్థి ఐనా కేశినేని చిన్నికి ఇచ్చారు. దాని బదులు ఆయనకు విజయవాడ పశ్చిమం నుండి ఎమ్మెల్యే గా టికెట్ లభించింది. 

అసలు ఆ టికెట్ జనసేన అభ్యర్థి పోతినా మహేష్ కు ఇస్తామన్నారు. కానీ అనూహ్యంగా చివరికి దానిని బీజేపీ ఐనా సుజనా చౌదరి కి వెళ్ళింది. అయితే అప్పటికే ఆ టికెట్ పై ఆశ పడిన మహేష్, అలాగే జలీల్ ఖాన్ మరియు బుద్ధా వెంకన్న లాంటి వారందరిని కలుపుకొక తప్పలేదు సుజనా చౌదరికి ఎందుకంటె ఆయనకి నియోజకవర్గ కొత్త కనుక.అక్కడ టీడీపీ మరియు జనసేన సహకరిస్తే తప్ప పూర్తిస్థాయిలో సుజనా గెలిచే ఛాన్స్ లేదు.ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కి విజయవాడ పశ్చిమ అసలు కలిసిరాదనే చెప్పాలి 2014 లో బీజేపీ ఓటమి పాలైంది.
పశ్చిమ ఓటర్లు మొత్తం 2.5లక్షల మంది ఉండగా అందులో మైనారిటీలు అరవై వేలమంది దాక ఉన్నారు. ఎస్సి, ఎస్టీ లు దాదాపు యాభై వేలమంది దాక ఉన్నారు. అయితే సుజనా స్థానికుడు కాదని అలాగే తమకి ఎప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అయితే దీన్ని సుజనా కోట్టిపారేస్తున్నారు. తానేప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పడం అనేది చాలా కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: