ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం.. ఆర్సిబి కెప్టెన్ కామెంట్స్ వైరల్?

praveen
2024 ఐపిఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో సారి నిరాశ పరిచేలాగే కనిపిస్తూ ఉంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో లాగానే ఈ సారి ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు టైటిల్ గెలుస్తుందని అందరూ నమ్మకం పెట్టుకుంటే.. లీగ్ మ్యాచ్లలో వరసగా ఓటములు చవి చూస్తుంది జట్టు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు టీం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది.

 ఇటీవల హోమ్ గ్రౌండ్ అయినా చిన్న స్వామి స్టేడియం లో కోల్కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో బెంగుళూరు జట్టు సత్తా చాట లేక పోయింది. తప్పకుండా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో చివరికి ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఓటమిపై స్పందించిన కెప్టెన్ ఫ్యాప్ డూప్లెసెస్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ కండిషన్స్ తమకు ప్రతికూలంగా మారాయి అంటూ చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ అనుకూలంగా మారింది. చేజింగ్ లో బ్యాటింగ్ మరింత సులభమైంది అంటూ చెప్పకు వచ్చాడు.

 సునీల్ నరైన్, ఫీల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్ తో పవర్ ప్లేన్ లో నే మ్యాచ్ ను మా నుంచి లాగేసారు. ఇక ఇద్దరు అసాధారణమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. మేము మ్యాక్స్ వెల్ తో పాటు ఫింగర్ స్పిన్నర్లను ప్రయత్నించాలని అనుకున్నాం. కానీ ఈ వికెట్ ఫై అంత ఈజీగా టర్న్ లభించలేదు. అంతేకాకుండా కోల్కతా బ్యాటర్లు లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో బరిలోకి దిగడంతో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేకపోయాము. మాకు రెండు వైపుల టర్న్ చేయగల మణికట్టు స్పిన్నర్ల అవసరం ఉంది అంటూ ఫ్యాప్ డూప్లెసెస్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: