తెరపైకి మరో కథ.. చంద్రబాబు.. పవన్.. పురందేశ్వరి మొబైల్ ట్యాప్ అంటు..?

Divya
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో చాలా సంచలనంగా మారుతోంది .ప్రతిపక్ష నేతలు మొబైల్స్ ను సైతం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్లుగా పలు రకాల ఆరోపణలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.. కొంతమంది అధికారులను నియమించి మరి వారి యొక్క మొబైల్స్ ను ట్యాపింగ్ చేయిస్తున్నారంటూ వాదనలైతే వినిపిస్తున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ పైన తెలుగుదేశం పార్టీ పలు రకాల ఆరోపణలు చేస్తోంది. ఈ విషయం పైన టిడిపి సీనియర్ నేత బోండా ఉమా కూడా మీడియా సమావేశం తో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల ఫోన్లోను ట్యాప్ చేస్తున్నారంటే కెసిఆర్ జగన్ ఇద్దరు కూడా కలిసే ఒక సాఫ్ట్వేర్ కనుగొన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

టిడిపి నేతల ఫోన్లను సైతం జగన్ ట్యాప్ చేస్తున్నారంటూ తమను ఫాలో అవుతున్నారంటూ కొంతమందిని పట్టుకున్నామంటూ కూడా వెల్లడించారు బోండా ఉమా.. దీనిపైన ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తున్నామంటూ వెల్లడించారు.ముఖ్యంగా తమ నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి మొబైల్స్ ను కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మంత్రులు పెద్దిరెడ్డి ,గుడివాడ అమర్నాథ్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు బోండా ఉమా.

పార్టీ వర్క్ షాప్ కు కూడా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ వచ్చారని ఆయన పేరు విశ్వేశ్వరరావు అన్నట్లుగా తెలియజేశారు. ఐజి పంపితేనే వచ్చామంటూ వెల్లడించాలని తెలిపారు బోండా ఉమా.. మరి మొబైల్ ట్యాపింగ్ విషయం పైన ఏపీ సీఎం ఏం మాట్లాడతారో అంటూ ప్రశ్నిస్తున్నారు. అలా పాల్పడిన వారిని విధుల నుంచి తప్పించాలంటూ కూడా డిమాండ్ చేశారని అయితే ఆ కానిస్టేబుల్ను పట్టుకుంటే అన్ని విషయాలు బయటకి వస్తాయంటూ కూడా వెల్లడించారు. తమ మీద నిగా పెట్టడం కంటే డ్రగ్స్ వ్యవహారం పైన దృష్టి పెడితే బాగుంటుందంటూ బోండా ఉమ తెలిపారు. ఈ విషయాన్ని వైసిపి శ్రేణులు ఖండిస్తూ ఇదంతా ఒక కట్టు కథ అంటూ తెలుపుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: