చంద్రబాబు పైన మోడీకి కంప్లైంట్ చేసిన పురందేశ్వరి..!!

Divya
టిడిపి, జనసేన, బిజెపి కూటమి తో ఈసారి ఎన్నికలలో వైసిపి పార్టీతో పోటీ పడబోతున్నారు. బిజెపికి 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంటు స్థానాలను కూడా దక్కించుకుంది. అయితే ఈ విషయంపైన బీజేపీ ఇంకా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.టిడిపి జనసేన కలిసి తమకు కేటాయించిన సీట్ల విషయంలో ఏపీ బీజేపీ నేతలలో చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా చెప్పాలి అంటే బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి చంద్రబాబు పైన నేరుగానే మోడీకి వెళ్లి ఫిర్యాదు చేసినట్లుగా బిజెపి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కొన్ని దశాబ్దాల పాటు టీడీపీ గెలవని సీట్లను బిజెపికి ఇచ్చారని.. వీటితో పాటు టిడిపి నుంచి బిజెపిలోకి వచ్చిన వారికి మాత్రమే సీట్లు కేటాయించారని పురందేశ్వరి ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం.. బిజెపి పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేకూరాలి అంటే కచ్చితంగా టిడిపి నుంచి వచ్చిన నాయకులకు ఆ టికెట్లు ఇవ్వకూడదని ఆమె అందులో ప్రస్తావించినట్లుగా తెలుస్తున్నది.. ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లి మరి బిజెపి అగ్రనేతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేయవచ్చు అని నాయకుల అభిప్రాయంగా వెల్లడించింది.

అయితే ఆ ఓడిపోయే సీట్లు తమకు ఎందుకని బిజెపి నేతలు కూడా వాపోతున్నారు. మరొకవైపు చంద్రబాబు నాయుడు మాత్రం చాలా తెలివిగా తనకు కావాల్సిన సీట్లను తీసుకొని కూటమిని మోసం చేస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో బిజెపి నిలబడబోతున్న ఆరు పార్లమెంటు స్థానాలలో కేవలం పురందేశ్వరి పోటీ చేసే ఒక సీటు తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా బిజెపి ఫెయిల్యూర్ అవుతుందట. ముఖ్యంగా బలం లేనటువంటి ప్రాంతాలలో సీటు ఇవ్వడంతో పాటు కేవలం బిజెపితో అవసరం ఉండే పోతు పెట్టుకున్నట్లు కురందేశ్వరి వెల్లడించింది. మరి ఈ మేరకు ఢిల్లీలో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబుకు కండిషన్లు పెడతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: