ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటించి కాస్త ఉపశమనం పొందాలని చూస్తున్న వేళ పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. 94 అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత కొన్ని చోట్ల పార్టీ నాయకుల ఆగ్రాహావేశాలు, అసంతృప్తులు వీటిని చల్లార్చే క్రమంలో ఆయన తలామునకలై ఉంటే ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడింది. పార్టీలో సీనియర్లకు సీట్లు దక్కే పరిస్థితి లేకపోవడంతో వారి అనుచరులు పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు.

పొత్తులు, సమీకరణాల పేరుతో సుదీర్ఘ కాలం పార్టీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు పక్కన పెడుతున్నారని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. తొలి జాబితాలో చాలా మందికి సీటు నిరాకరించగా.. మరో జాబితాలో వారికి చోటు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. దెందులూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో మరొకరకి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావుకు సీటు ఖరారు కాలేదు.

వీరితో పాటు పార్టీ సీనియర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బండారు సత్యనారాయణ, దేవినేని ఉమ లాంటి పార్టీని నమ్ముకున్న సీనియర్లకు సీటు ఇచ్చేది లేనిది అనుమానంగా మారింది. మరోవైపు బీజేపీ తో పొత్తుల సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ కాషాయ దళం కలిస్తే వారు ఎన్ని సీట్లు అడుగుతారో.. ఏయే స్థానాలు కోరతారో తేలాల్సి ఉంది.

జనసేన కేవలం ఐదు స్థానాల్లోనే తమ అభ్యర్థులను ప్రకటించింది.  ఆ పార్టీకి 24 సీట్లు ఇవ్వడంపై ఇప్పటికే పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. రేపు ఆ పార్టీ అభ్యర్థులు జాబితా విడుదల చేస్తే ఇంకెన్నీ గొడవలు జరగుతాయో. మరోవైపు పార్టీని నమ్ముకున్న వారందరికీ సీట్లు ఇవ్వలేరు. దీంతో ఎవరికి వారు అధినేతను కలిసి తమకు సీటు కేటాయించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ బీజేపీ సొంతంగా పోటీ చేస్తామని చెబితే మాత్రం చంద్రబాబుపై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దీనిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: