షాక్: టిడిపి నుంచి మహాసేన రాజేష్ ఔట్..!!

Divya
ఆంధ్ర రాజకీయాలలో రోజురోజుకీ ఆసక్తి పెంచేలా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించిన కూడా ఎన్నికల వచ్చేవరకు పోటీలు ఎవరు ఉంటారని విషయాన్ని చెప్పలేని పరిస్థితి ఉన్నది.. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వైసిపి పార్టీ సమరంలోకి ముందుకు వెళ్తుంటే టిడిపి జనసేన కూటమితో కూడా ఉమ్మడి అభ్యర్థుల జాబితాలను ప్రకటించుకున్నారు.. దీంతో చాలామంది నేతలు ఇరువురు పార్టీల పైన అసంతృప్తిని తెలియజేస్తున్నారు.. ఇలాంటి సమయంలోనే ఒక టిడిపి అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోబోతున్నట్లు ఒక సంచలన నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది..

ఇటీవల టిడిపి జనసేన కూటమితో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను 118 స్థానాలను ప్రకటించారు.. అయితే ఇందులో కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఎంపిక విషయంలో స్థానికంగా నిరసనలు కూడా మొదలయ్యాయి.. అలా వ్యతిరేకవస్తున్న నియోజకవర్గాలలో ఉమ్మడి గోదావరి జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి అయిన సరిపెల్ల రాజేష్..(మహాసేన రాజేష్) ను ప్రకటించారు.. అక్కడ టిడిపి జనసేన నేతలు ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారు బహిరంగంగానే నిరసనలను కూడా తెలియజేశారు దీంతో అక్కడ రాజకీయం రసాభాసంగా మారింది.

అంతేకాకుండా మహాసేన రాజేష్ హిందూ మతం పైన అగ్రవర్ణాల అమ్మాయిల పైన చాలా అసభ్యకరంగా కూడా వ్యాఖ్యలు చేశారు..గతంలో జనసేన నాయకులను కూడా బండబూతులు తిట్టారు.. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి ఇలా చేసిన వీరికి టికెట్లు ఇవ్వడం ఏంటి అంటూ పలువురు కార్యకర్తలు కూడా అసహనంతో ఉన్నారు.. ఒకవేళ రాజేష్ అభ్యర్థిగా నిలబడితే తామే ఓడిస్తామంటూ కూడా టిడిపి జనసేన కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన రాజేష్ కు చాలా నిరసన సెగలు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే టిడిపి అధిష్టానమే రాజేష్ ను అక్కడి నుంచి తప్పించినట్లు టాక్ వినిపిస్తున్నది.. ఈ విషయాన్ని చాలా సైలెంట్ గా ఉంచి రాజేష్ ఒక ట్విట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.. తానే గన్నవరం పోటీ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు.. గతంలో తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు తనకు ఇలాంటి ఇబ్బందులు పడ్డాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: