మరో 10 ఏళ్ల పాటు సీఎం జగనే.. ఆయన జైలుకి.. వేణు స్వామి హాట్ కామెంట్స్..!!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో పొలిటికల్ పరంగా, సినీ ఇండస్ట్రీ పరంగా వేణు స్వామి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. ఎందుకంటే వేణు స్వామి అనే వ్యక్తి మొదట సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల జాతకాలను తెలియజేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా నాగచైతన్య సమంత పెళ్లయిన కొన్నేళ్లకే విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే వేణు స్వామి చెప్పినట్టుగానే వీరిద్దరికి పెళ్లి అయిన కొన్నేళ్ళకే విడిపోయారు అలా వేణు స్వామి క్రేజ్ భార్య గాని పెరిగిపోయింది..
చాలామంది హీరోయిన్స్ సైతం వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకొని మరి స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారు.. ఇలా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నేతల భవిష్యత్తులను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే తాజాగా వేణు స్వామి యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు రకాల వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్ర రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది..
వేణు స్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనవిజయంగా గెలుస్తారంటూ వెల్లడించారు 2029 ఎన్నికలు జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర సీఎం అంటూ కూడా వెల్లడించారు..చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అంతరించిపోతుందంటూ కూడా వెల్లడించారు.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి అక్కడ రాజీనామా చేసిన షర్మిల ఆంధ్రాలో పిసిసి బాధ్యతలు చేపట్టిన రాజకీయంగా పెద్దగా ఎదగలేదంటూ తెలియజేశారు. తన అన్నతో కలిసి ఉంటేనే తన జీవితం బాగుంటుందంటూ కూడా వెల్లడించారు.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయంగా అభివృద్ధి చెంది అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ వెల్లడించారు.. నారా లోకేష్ 2024లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. మాజీ సీఎం సైతం జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: