చంద్రబాబుకు చెక్ పెడుతున్న.. బిజెపి..!!

Divya
చంద్రబాబు రాజకీయంగా ఎదగాలని ఎన్నో సాయి శక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు..వాస్తవానికి సింగల్ గా ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేక ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ముందుకు వెళుతూ ఉంటారు చంద్రబాబు.. ఈసారి కూడా ఎలాగైనా బిజెపి జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళుతూ తమ ఇమేజ్ను పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎప్పుడు కూడా సింగల్ గా పోటీ చేసి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూడా లేరు.. కేవలం తన దృష్టి అంత ఎక్కువగా ముఖ్యమంత్రి అవ్వడం పైనే పెడుతూ ఉంటారు.

మొదటిసారిగా తన మామ కి వెన్నుపోటు పొడిచి సీఎం సీట్ లో కూర్చున్న చంద్రబాబు 1999 ఎన్నికలలో  కార్గిల్ యుద్ధం వల్ల బిజెపి పార్టీకి మంచి ఇమేజ్ వచ్చింది ఆ ఇమేజ్తో కూడా అప్పుడు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు.. మళ్ళి 2004లో ముందస్తు ఎన్నికలకు సై అంటూ చంద్రబాబు ఎన్డీఏ కూడా అందుబాటులోకి తీసుకొని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎన్డీఏ పార్టీని కూడా చంద్రబాబు ముంచేశారు.. అలా ఎన్డిఏ పార్టీ ఓడిపోవడంతో వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మసీదులు కూల్చే పార్టీతో మళ్ళీ జతకట్టేది లేదని విషయాలను కూడా తెలియజేశారు.
అప్పట్లో గుజరాత్ అల్లర్ల వల్లే ఇండియా ఓడిపోయింది అని వార్తలు కూడా వినిపించాయి.మల్లి 2009లో ఓటమిపాలు కావడంతో 2014లో మళ్లీ బిజెపితోనే పొత్తు పెట్టుకున్నారు.. అలా 2014లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు సైతం రాజీవ్ చేయడంతో బిజెపితో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని మళ్లీ బిజెపి పార్టీ నానా మాటలు అంటూ ఎన్డీఏ పార్టీ నుంచి బయటికి వచ్చారు.. చంద్రబాబు అసలు స్వరూపాన్ని గ్రహించిన ఆంధ్ర ప్రజలు 2019లో చాలా ఘోరంగా ఓడించారు.. మరి ఈసారి 2024 ఎన్నికలలో భాగంగా బిజెపి కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బిజెపి పార్టీ వెళ్తే ఒంటరిగా వెళ్తుందని పొత్తులతో వెళ్ళదని తేల్చి చెప్పేసారట చంద్రబాబుకు.. దీంతో చంద్రబాబు హుటాహుటిగా టిడిపి జనసేన అభ్యర్థుల లిస్టులను కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: