ఆ నియోజకవర్గాలపై పవన్ ఫోకస్?

Purushottham Vinay
జనసేనాని పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన 24సీట్లలో పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంపై హాట్‌ టాపిక్ నడుస్తుంది.రెండు రోజుల క్రితం భీమవరంలో పర్యటించిన పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ అక్కడి తెలుగుదేశం, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అలాగే తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలు క్యాడర్‌లోకి పంపారు. పవన్‌ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే అంతా సహకరిస్తామని అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెప్పుకొచ్చారు. అటు జనసేన పార్టీ నేతలు కూడా తమ నాయకుడు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. నిన్న జనసేన పార్టీ సీట్ల ప్రకటనలో పవన్‌ కళ్యాణ్ తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో చెప్పకపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. పవన్‌ కళ్యాణ్ ఎక్కడో నుంచి పోటీ చేస్తారో తెలియక క్యాడర్ అయోమయంలో పడింది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, నారా లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించినా.. పవన్‌ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.


భీమవరం ప్రకటన విషయంలో మాత్రం పవన్‌ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.గతంలో పవన్‌ కల్యాణ్‌ భీమవరం ఇంకా గాజువాకలో పోటీ చేశారు. ఇక ఓటమి తర్వాత అటువైపు చూడలేదు. పవన్ ప్రస్తుతానికి భీమవరం నుంచే పోటీ చేస్తారని మొదట నుంచి చెబుతున్నప్పటికీ కూడా ఆయన మరో స్థానం నుంచి బరిలో దిగే ఆలోచన చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగానే పిఠాపురం, కాకినాడ పేర్లు పరిశీలిస్తున్నారనే సమాచారం వినిపిస్తుంది.ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందనే లెక్కలతో అటువైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.. మొత్తానికి భీమవరం లేదా, కాకినాడ, పిఠాపురంలో ఏదో ఒక స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశమైతే లేకపోలేదు. ఇక ఉత్తరాంధ్ర, కోస్తా ఇంకా రాయలసీమ జిల్లాపై ప్రధానంగా స్పెషల్ ఫోకస్ చేశారు పవన్ కల్యాణ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: