టిడిపి కేడర్లో అసంతృప్తి.. చంద్రన్న మాట లెక్కలేదా..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఒక తుఫాను లాంటిది.. ఇప్పుడు ఏ వైపుగా వీస్తుందో ఎవరు చెప్పలేము.. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసిపి పార్టీలోని కొంతమంది ఇన్చార్జిలలోని మార్పులతో ఆ పార్టీలోని చిన్నపాటి కాస్త వ్యతిరేకతలైతే గతంలో వినిపించాయి.. ఇటీవల సర్దు ములుగుతున్న సమయంలో ఇప్పుడు టిడిపి పార్టీలో జరుగుతున్న పరిణామాల అదృష్ట ఏకంగా ఆ పార్టీలో ఒక తుఫాను రాబోతోందని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా పలు రకాల నియోజకవర్గాలలోని ఇన్చార్జిలు తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు వైయస్సార్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తెగ సంబరాలు పడ్డారు.. అయితే ఇప్పుడు తమ దాకా వస్తే కానీ ఆ నొప్పి ఏంటనే విషయం తెలియడం లేదు.. టిడిపి టికెట్ ఆశించి ఉన్నటువంటి కొంతమంది నేతలు బగ్గుమంటున్నారు. ఒక్కొక్కరిగా వచ్చి తమా ఆసంతృప్తిని సైతం కేడర్ ముందు వ్యక్తం చేస్తున్నారట. కొంతమంది టికెట్ ఎవరికీ అనే విషయం పైన ఖరారు చేసే వరకు వేచి చూస్తామని బహిరంగంగానే అసంతృప్తిగా ఉన్నామంటే తెలియజేస్తున్నారట.

ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లిన కొంతమంది నేతలకు సైతం టిడిపి పార్టీ టికెట్ ఇస్తానని చెప్పడంతో ఇప్పుడు టిడిపిలో కూడా ఒక చిచ్చు మొదలవుతోంది.దీంతో పలువురు టిడిపి నేతలు తమ అనుచరులతో ఆత్మీయ సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారట. ఇలాంటి సమయంలో పార్టీని వీడేందుకు కూడా చాలామంది సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది సీనియర్ నేతలు కూడా తీవ్రమైన వ్యతిరేకతో ఉండడమే కాకుండా చంద్రబాబు మాటను కూడా అసలు లెక్క చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమలోని నేతలు అయితే చంద్రబాబును అసలు పట్టించుకోవడంలేదట.తమకి కాదని మరొకరికి టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వమంటూ కూడా డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: