ప్రధాన ఓటు బ్యాంకు పై గురిపెట్టిన ఏపీ సీఎం.. వారికి వరాలే..!!
ఏపీ సీఎం జగన్ కొత్త వ్యూహాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మంది ప్రజలకు తాము చేసిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మంచి జరుగుతేనే తమకు ఓటు వేయాలంటూ కూడా కితాబిచ్చారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలోనైనా సరే వైఎస్ఆర్సిపి మార్కు కనిపిస్తోందంటూ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చేసిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చెప్పుకోవడానికి లేదంటూ కూడా తెలిపారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని విషయాలు వెలుపడుతున్నాయి.. గోదావరి జిల్లాలలో శెట్టిబలిజ వర్గానికి ఎక్కువగా ఏపీ సీఎం ప్రాధాన్యత ఇచ్చారు.జనసేన టిడిపి పొత్తుల విషయంలో కేవలం 20 సీట్లు జనసేనకు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇవన్నీ కూడా జనసేన అభిమానులను కార్యకర్తలను నిరాశపరిచేలా చేస్తున్నాయి.ఎన్నికలవేళ జగన్ ప్రభుత్వం సరికొత్త హామీలను చెప్పే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెన్షన్ 3000 నుంచి 4 వేల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీ పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పిఆర్సి కమిటీ నియమించిన రిపోర్టు ఆలస్యం కావడంతో IR ప్రకటించే దిశగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల వద్ద అనే విషయం పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈనెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ సమయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.