మళ్లీ అలాంటి తప్పే చేస్తున్న చంద్రబాబు..!!
అలా ఇప్పటికే నరసాపురంలో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత రఘురామకృష్ణ రాజుకు అదే నియోజవర్గం నుంచి టిడిపి టికెట్ ఇవ్వబోతున్నారు.. అలాగే నరసరావుపేట నుంచి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన శ్రీకృష్ణదేవరాయలను కూడా స్థానిక ఎమ్మెల్యేలు వల్ల ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో లోకేష్ తదితర టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారని టిడిపి నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మచిలీపట్నం నుంచి వైసీపీ జెండా ఎగరవేసిన వల్లభనేని బాలశౌర్యు కూడా పార్టీని వీడారు.. అయితే జనసేనలో చేరినప్పటికీ టిడిపి జనసేన ఇద్దరు కూడా కూటమి అభ్యర్థి కావడంతో ఇక్కడ ఈయననే నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
మరొకవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇది కూడా ఇదే పరిస్థితి. ఇలా కనపడిన ప్రతి నియోజకవర్గంలో కూడా వైసిపి అభ్యర్థులను మార్చిన తర్వాత వెంటనే వారిని టిడిపిలోకి ఆహ్వానిస్తూ పోటీ చేయడానికి చంద్రబాబు అంగీకరిస్తూ ఉండడంతో అటు నాయకులు కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చినవారు ఇక మన పార్టీలో ఎలా గెలుస్తారు జనాలలో వీరి గుర్తింపు పలచన అయిపోయిందని ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత..మన పార్టీలో చేర్చుకుంటే ఎలా అంటూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీకి పనిచేసిన వారిని ఎవరో ఒకరిని నిలబెట్టొచ్చు కదా అనే ప్రశ్న మొదలవుతోంది. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు మళ్ళీ అదే తప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.